టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన సతీమణి సాక్షి ధోనీని ఆటపట్టించారు. ఒక పేమేంట్ గేట్‌వేకు ప్రకటన చిత్రీకరణలో భాగంగా నమోదైనట్లు తెలుస్తోంది. బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను ధోని షేర్ చేశారు. ఈ పోస్టులో ఓ కామెంట్ కూడా పెట్టారు ఈ ఘటన జరిగి సంవత్సరం అయిందని పేర్కొన్నారు. ధోని షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో పేమెంట్ చెల్లింపులకు చెందిన డైలాగ్ ఉన్నాయి. అయితే సాక్షి ధోని డైలాగ్ చేప్పేందుకు ప్రయత్నించింది. అయితే డైలాగ్ చెప్పేందుకు తడబడింది. దీంతో కల్పించుకున్న ధోని డైలాగ్‌ను చెప్పలేవా అంటూ సాక్షిని ఆటపట్టించారు. సాక్షి తో ధోనీ ఇద్దరూ పక్కనే కూర్చున్నారు. ధోని పోస్ట్ చేసిన వీడియోను చూసిన నెటిజన్లు లైక్ లు షేరులతో స్పందన తెలియజేస్తున్నారు.
ధోని పునరాగమనంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తూన్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ అనంతరం ధోని మైదానంలో అడుగె పెట్టలేదు. న్యూజిలాండ్ జట్టుపై తన చివరి మ్యాచ్ ఆడాడు. క్రికెట్‌కు దూరంగా ఉంటూ వచ్చాడు. ఆ తర్వాత రెండు నెలల పాటు భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేశారు.గత కొంత కాలంగా ధోని క్రికెట్ దూరంగా ఉన్నారు. అతను చివరి వన్డే జూలైలో న్యూజిలాండ్ పై ఆడాడు. ఆ తర్వాత ధోని పునరాగమనం చేయలేదు. జట్టులోకి పునరాగమంపై ప్రశ్నించగా జనవరి వరకూ ఓపిక పట్టాలని అప్పటి వరకూ ఏమి అడగవద్దని కోరారు.