Ind vs Eng: భారత బౌలర్లు ముగించారు..బ్యాట్స్ మెన్ లు ఆరంభించారు

* అదరగొట్టిన ఇండియన్ పేసర్లు * 183 పరుగులకే అలౌట్‌ అయిన ఇంగ్లండ్‌ టీం *టీమిండియా 21/0

Update: 2021-08-05 01:39 GMT

టీమిండియా (ట్విట్టర్ ఫోటో)

Ind vs Eng Test: ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ను టీమిండియా అద్భుతంగా మొదలుపెట్టింది. భారత పేసర్ల దాటికి తొలిరోజే ఇంగ్లండ్‌ జట్టు కుప్పకూలిపోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ జో రూట్ అర్ధ సెంచరీ మినహా ఎవరు అంతగా రాణించలేదు. నలుగురు బ్యాట్స్‌మెన్స్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపించారు. భారత్‌ బౌలర్లు అద్భుతంగా చెలరేగారు. ముఖ్యంగా బుమ్రా, షమీ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేశారు.

బుమ్రా నాలుగు, షమీ మూడు వికెట్లు తీశాడు. శార్దుల్‌ ఠాకూర్‌ రెండు, సిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. మొత్తానికి నలుగురు పేసర్లతో రంగంలోకి దిగిన భారత జట్టు సక్సెస్‌ అయ్యింది. తర్వాత బ్యాటింగ్ కి దిగిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ 9, రాహుల్‌ 9 రన్స్ తో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లు తమ అద్భుత బౌలింగ్ తో ఇంగ్లాండ్ ఆటను మొదటి రోజే ముగించగా, ఇంకా భారత బ్యాట్స్ మెన్ లు ఆటను మొదలుపెట్టారు.

Tags:    

Similar News