T20 World Cup 2021 - Aus Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్

* వెస్టిండిస్ జట్టుతో కీలక మ్యాచ్ లో తలపడనున్న ఆసీస్

Update: 2021-11-06 09:43 GMT

Australia Vs West Indies:  నేడు నవంబర్ 6న ఆస్ట్రేలియా - వెస్టిండిస్ మధ్య అబుధాబి వేదికగా కీలక మ్యాచ్ మొదలుకానుంది. తాజాగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సెమీస్ ఆశలు వదులుకున్న వెస్టిండిస్ జట్టుకు ఇది నామమాత్రపు మ్యాచ్ అయిన ఆస్ట్రేలియా జట్టుకు మాత్రం గెలుపు తప్పనిసరి. అయితే ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పబోతున్న బ్రేవోకి మాత్రం విజయంతో ఘనంగా వీడ్కోలు పలకాలని విండీస్ ఆటగాళ్ళు ఎదురుచూస్తున్నారు.

గ్రూప్ 1 నుండి సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ లో ఆసీస్ విజయం సాధించిన, ఆ తరువాత దక్షిణాఫ్రికా - ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ పూర్తయ్యే వరకు ఎవరు సెమీస్ వెళ్తారో మాత్రం తెలియని పరిస్థితి. ఒకవేళ ఇటు ఆసీస్, అటు దక్షిణాఫ్రికా ఇరు జట్లు గెలిస్తే నెట్ రన్ రేట్ తో ఫలితం తేలనుంది.

మ్యాచ్ వివరాలు:

ఆస్ట్రేలియా vs వెస్టిండిస్

నవంబర్ 6(శనివారం)2021

మధ్యాహ్నం 3.30 నిమిషాలకు

షేక్ జాయద్ క్రికెట్ స్టేడియం, అబుధాబి

హెడ్ టూ హెడ్:

ఇప్పటివరకు ఆస్ట్రేలియా vs వెస్టిండిస్ 16 మ్యాచులలో తలపడగా ఆస్ట్రేలియా 6 మ్యాచ్ లలో, వెస్టిండిస్ 10 మ్యాచ్ లలో గెలుపొందింది. ఇక టీ20 ప్రపంచకప్ లో అయిదు సార్లు పోటీపడగా మూడు సార్లు వెస్టిండిస్, రెండు సార్లు ఆస్ట్రేలియా విజయం సాధించాయి.

ఆస్ట్రేలియా జట్టు:

డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(సి), మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్(w), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

వెస్టిండిస్ జట్టు:

క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్, నికోలస్ పూరన్(w), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, కీరన్ పొలార్డ్(c), ఆండ్రీ రస్సెల్, జాసన్ హోల్డర్, డ్వేన్ బ్రావో, హేడెన్ వాల్ష్, అకేల్ హోసేన్

Tags:    

Similar News