పెళ్లి చేసుకోవాలన్న అభిమానికి శ్రీలంక క్రికెటర్ అదిరిపోయే రిప్లై
దక్షిణాఫ్రికాలో జరిగిన మాన్షీలీగ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.
దక్షిణాఫ్రికాలో జరిగిన మాన్షీలీగ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. మాన్షీలీగ్‌లో ష్వానే స్పార్టన్స్, పార్ల్ రాక్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా శ్రీలంక ఆటగాడు ఇసురు ఉదానాను పెళ్లి చేసుకోవాలని ఓ మహిళా అభిమాని ప్లకార్డుతో ప్రదర్శించింది. దీంతో ఆ అభిమానికి ఉదానా ఇచ్చిన రిప్లే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
శ్రీలంక ఆటగాడు ఉదానా ఆ ఫ్యాన్ కు ఏం సమాదానం ఇచ్చాడో తెలుసా.. ఆ అభిమానికి నిరాశకు గురిచేశాడు. తనకు ఇది వరకే పెళ్లైయిందని పేర్కొంటూ తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ జవాబు ఇచ్చాడు. దీంతో ఉదానను నెటిజన్లు ప్రసంశలతో ముంచెత్తారు. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబందించిన ఫోటోలు వైరల్ అయ్యియి.
మాన్షి లీగ్ 50రోజుగా జరుగుతుంది. ఈ లీగ్ విజయవంతంగా ముగిసింది. ఫైనల్లో పార్ల్ రాక్స్ టైటిట్ సొంతం చేసుకుంది. టాస్ గెలిచి పార్ల్ రాక్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన స్పార్టన్స్ నిర్ణిత 20 ఓవర్లలో 147/6 చేసింది. ఏబీ డివిలియర్స్ ఫిఫ్టీ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఛేదనలో హెన్రీ డేవిడ్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ( 77 నాటౌట్) జట్టును విజయ తీరాలకు చెర్చాడు.
#MSLT20 #MslT20Final fan moment @IAmIsuru17 very good answer I have allredy one ring pic.twitter.com/Us199QNi6K
— mohamed arsath (@BmArsath1) December 16, 2019