Srilanka vs Ireland: లంకేయుల శతకబాదుడు, టీమిండియా, పాక్ తర్వాత శ్రీలంకకే ఆ రికార్డ్
Srilanka vs Ireland: లంకేయుల శతకబాదుడు, టీమిండియా, పాక్ తర్వాత శ్రీలంకకే ఆ రికార్డ్
Srilanka vs Ireland: లంకేయుల శతకబాదుడు, టీమిండియా, పాక్ తర్వాత శ్రీలంకకే ఆ రికార్డ్
Srilanka vs Ireland: ఐర్లాండ్ తో జరుగుతున్న రెండో, చివరి టెస్టులో ఆతిథ్య శ్రీలంక జట్టు చెలరేగిపోయింది. గాలేలో జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కి దిగిన ఐర్లాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 492 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన సింహళీయులు గర్జించారు. సెంచరీలతో కదం తొక్కారు.
లంక ఓపెనర్లు మధుష్క, కరుణరత్నే దూకుడుగా ఆడి సెంచరీలు సాధించారు. మధుష్క 205 పరుగులు సాధిస్తే, కరుణరత్నే 115 పరుగులు చేశాడు. ఇక వన్ డౌన్ బ్యాట్స్ మెన్ గా బరిలోకి దిగిన మన్ కుశాల్ మెండిస్ సైతం ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 245 పరుగులు సాధించాడు. సీనియర్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ సైతం 100 పరుగులు సాధించి నాట్ ఔట్ గా నిలిచాడు. భారీ స్కోరు సాధించడంతో శ్రీలంక 704 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది.
టెస్టు మ్యాచ్ విషయంలో పెద్దగా అనుభవం లేని ఐర్లాండ్ ఆటగాళ్లు శ్రీలంకన్ బ్యాట్స్ మెన్ స్వైరవిహారం చేస్తుంటే చేష్టలుడికి చూస్తుండిపోయారు. ఇక 212 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఐర్లాండ్ టీమ్ కేవలం 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఎదురీదుతోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప శ్రీలంక విజయాన్ని ఐర్లాండ్ ఆపలేదు. ఈ టెస్టులో విజయం సాధిస్తే శ్రీలంక క్లీన్ స్వీప్ చేసినట్లు అవుతుంది. ఏదిఏమైనా, శ్రీలంక విజయం నామమాత్రంగా మారింది.
ఇకపోతే ఒక టెస్టులో టాప్ 4 బ్యాట్స్ మెన్ సెంచరీలు చేయడం టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇది 3వ సారిమాత్రమే. 2007లో బంగ్లాదేశ్ పై ఆడుతూ టీమిండియా ఈ రికార్డును తొలిసారి సాధించింది. దినేశ్ కార్తీక్, వసీమ్ జాఫర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ సెంచరీలు సాధించారు. ఆ తర్వాత 2019లో శ్రీలంకపై ఆడుతూ పాక్ బ్యాట్స్ మెన్ ఈ రికార్డును అందుకున్నారు. షాన్, అబిద్, అజహర్, బాబర్ సెంచరీలు నమోదు చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు శ్రీలంక ఈ అరుదైన ఘనతను దక్కించుకుంది.