బుమ్రా విషయం గంగూలీ చెప్పినా వెనక్కి తగ్గని ద్రవిడ్

టీమిండియా ప్రధాన బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాపై ఎన్‌సీఏ డైరక్టర్ రాహుల్ ద్రవిడ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

Update: 2019-12-28 10:35 GMT
Rahul Dravid

టీమిండియా ప్రధాన బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాపై ఎన్‌సీఏ డైరక్టర్ రాహుల్ ద్రవిడ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బుమ్రా వెన్నుగాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. బుమ్రా పూర్తిగా కొలుకునే వరకు సొంత టీమ్‌ సహకారంతోనే కొలుకునే ప్రయత్నం చేశాడు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం చెప్పినట్లు చేశాడు. ట్రైనర్ రజనీకాంత్‌ శివజ్ఞానం నేతృత్వంలో ముంబైలో శిక్షణ తీసుకున్నాడు. జాతీయ బోర్డు కాంట్రాక్టు ఆటగాడిని అని బుమ్రా మరిచిపోయి ఇలా తీసుకునే ముందు ఎన్సీఏను సంప్రదించడం చేయలేదు. అయితే దీనిని ద్రవిడ్ తప్పుపడుతున్నాడు.

బుమ్రా పూర్తి సమాచారం ఎన్సీఏకు అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. బుమ్రా గాయం నుంచి కోలుకున్న తర్వాత ఫిట్‌నెస్‌ టెస్టును ఎన్సీఏ నిర్వహిస్తుందని, ఆ ఫిట్‌నెస్‌ టెస్టు రిపోర్టు ఆధారంగానే సీనియర్ సెలెక్షన్ కమిటీ జట్టులోకి ఎంపికపై నిర్ణయం తీసుకుంటుందని ద్రవిడ్ అంటున్నాడు. అయితే గాయం నుంచి కోలుకునేందుకు బుమ్రా ఎన్సీఏ కాదని, తన పునరావాసాన్ని తను చూసుకోవడం తగదని అతని పూర్తిగా కోలుకున్నాడో లేదో తెలియకుండా, గాయం తీవ్రత గురించి తెలియకుడా సమీక్షించకుండా ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించడం కుదరదని ఎన్‌సీఏ సున్నితంగా బుమ్రాకు తేల్చి చెప్పింది. అంతా బాగయ్యాక ఇక్కడ పరీక్షించేది ఎంముందని బుమ్రా ఫిట్ నెస్ పరీక్ష నిర్వహించడం లేదని మిండియ భాతర జట్టు అసిస్టెంట్‌ ట్రెయినర్‌ యోగేశ్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎంతటి స్టార్‌ ఆటగాడైనా రూల్స్ పాటించాలని లేకుండా వ్యవస్థ దెబ్బ తింటుందని ద్రవిడ్ భావించాడు. దీంతో బుమ్రా పరిస్థితిపై ఆరా తీయడానికి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ నేరుగా ద్రవిడ్ ని కలిశాడు.

ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదని, ఇలా ప్రతి ఒక ప్లేయర్ సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎన్సీఏ ఉనికే ప్రమాదంలో పడుతుందని గంగూలీ వివరించాడు. దీంతో ఇదే విషయాన్ని గుంగూలీ స్పష్టం చేశాడు. ప్రతీ ఒక్కరూ ఎంతటి స్టార్‌ ఆటగాడైనా శిక్షణ తీసుకోవాలని తేల‍్చిచెప్పాడు. ఈ సందర్భంగా మాట్లాడిన గంగూలీ ద్రవిడ్‌ను కలిశాను. ఎన్‌సీఏలో ఒక పద్దతి ఉంది. టీమిండియా ఆటగాళ్లు ఎవరికైనా చికిత్స-శిక్షణ అవసరమైతే ఎన్‌సీఏకే వెళ్లాలి. శిక్షణ కోసం బయట ఫిజియోలను సంప్రదించడం సరైందని కాదని గంగూలీ స్పష్టం చేశాడు. 


Tags:    

Similar News