అందుకు కోహ్లీకి కృతజ్ఞతలు : గంగూలీ

ఈడెన్ గార్డెన్స్ చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. బంగ్లాదేశ్, భారత్ ఆడే డే-నైట్‌ మ్యాచ్ అక్కడ నిర్వహించనున్నారు.

Update: 2019-10-30 07:23 GMT

ఈడెన్ గార్డెన్స్ చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. బంగ్లాదేశ్, భారత్ ఆడే డే-నైట్‌ మ్యాచ్ అక్కడ నిర్వహించనున్నారు. దీనికి అంగీకరించిన టీమిండియా సారధి విరాట్ కోహ్లీకి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కొన్ని కారణాల వలన డే-నైట్‌ టెస్టులు బీసీసీఐ ఒప్పుకోలేదు. అయితే తాజాగా గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే డే-నైట్‌ టెస్టులు నిర్వహనపై దృష్టి పెట్టారు.

అయితే దీనిపై భారత క్రికెట్ జట్టు సారధి కోహ్లీ ఒప్పించిన అనంతరం మరో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ)ను గంగూలీ అంగీకరించేలా చేశారు. తొలి డే-నైట్‌ టెస్టుకు ఈడెన్ గార్డెన్స్ లో నిర్వహించేందుకు మార్గం సుగుమమైంది. సంప్రదాయ క్రికెట్ రక్షించాలంటే కొన్ని మార్పలకు శ్రీకారం చుట్టాలని గంగూలీ తెలిపారు. పింక్‌బాల్‌ టెస్టుకు అంగీకరించిన కోహ్లీకి ప్రత్యేక కృతజ్ఞతలు అని గంగూలీ పేర్కొన్నారు. 

Tags:    

Similar News