గంగూలీ డ్రీమ్‌ టీం ఇదే.. ఆ ఒక్కడిని విస్మరించిన దాదా

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తల కలల జట్టును ప్రకటించాడు.

Update: 2019-12-24 11:56 GMT
Sourav Ganguly File Photo

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తల కలల జట్టును ప్రకటించాడు. అయితే ఇది ఐపీఎల్ జట్టు కావడం విశేషం. తరచూ గంగూలీ తన డ్రీమ్‌ టీమ్ ను ప్రకటిస్తాడు. ఈ సారి బీసీసీఐ అధ్యక్షుడైన తర్వాత తన డ్రీమ్ ను ప్రకటించడం మొదటి సారి. గంగూలీ ఐపీఎల్ డ్రీమ్ ఎలెవన్ టీమ్‌కు సారథిగా తన పేరునే ప్రకటించారు. అయితే తన జట్టు వికెట్ కీపర్ గా మాజీ సారథి ధోనికి అవకాశం ఇవ్వలేదు.

ఐపీఎల్ జట్టకు ఓపెనర్లుగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌లను ఎంపిక చేసుకున్నాడు. మూడో స్థానంలో బ్యాట్స్‌మెన్‌గా ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంపిక చేశారు. గంగూలీ ఇష్టమైన నాలుగో స్థానంలో తన పేరునే ప్రకటించాడు. కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్, ఆల్‌రౌండర్‌ జాబితాలో రవీంద్ర జడేజా, మార్కస్ స్టాయినిస్, ఆండ్రీ రసెల్‌లకు చోటిచ్చాడు. యువ ఆటగాళ్లు రియాన్ పరాగ్‌, పేస్ బౌలర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, జోప్రా ఆర్చర్‌లను చోటిచ్చాడు.

అయితే గంగూలీ యువఆటగాడు పంత్ , పరాగ్‌లకు చోటిచ్చి ధోనీకి అవకాశం ఇవ్వడం పోవడంపై ధోని అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కలిసి ఆడే రోజుల్లో ధోనిని, గంగూలీ ఎంతో ప్రొత్సహించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ - 13వ సీజన్‌ 2020 కోసం దాదా తన జట్టు ప్రకటించాడు. ఇటీవలే ఐపీఎల్ వేలం ముగిసింది. వచ్చే ఏడాది మార్చి చివర్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది.

సౌరవ్ గంగూలీ జట్టు ఇదే

సౌరవ్ గంగూలీ (కెప్టెన్), రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ( కీపర్), రవీంద్ర జడేజా, ఆండ్రీ రసెల్, మార్కస్ స్టాయినిస్, రియాన్ పరాగ్, జోప్రా ఆర్చర్ ,జస్‌ప్రీత్ బుమ్రా .


Tags:    

Similar News