ఆ విషయం గురించి అవగాహన లేదు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్ట్రేషన్ సిటిజన్ బిల్లులపై భారత జట్టు మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించారు.

Update: 2019-12-21 10:28 GMT
సౌరవ్‌ గంగూలీ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్ట్రేషన్ సిటిజన్ బిల్లులపై భారత జట్టు మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) సంబంధించిన బిల్లుపై అవగాహన లేదని, దానిని పూర్తి చదవలేదని తెలిపారు. అయితే దేశంలో ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరారు.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో గంగూలీ మాట్లాడుతూ.. రాజకీయాలు మాట్లాడను కోవడంలేదు. వాస్తవానికి పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ బిల్లును నేను పరిశీలించలేదు. దానిపై అవగాహన లేకుండా నేను మాట్లాడను.. ప్రతీ ఒక్కరు ఆవేశాలకు లోనుకావద్దు, శాంతితో ఉండాలి, చట్టంతో ప్రయోజనాలు, ఎవరికి నష్టం చేకురుతుంది అనే అంశంపై చర్చించాలి అని గంగూలీ వ్యాఖ్యానించారు.

పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్ట్రేషన్ సిటిజన్ బిల్లులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఇటీవలే సౌరవ్‌ గంగూలీ కూతురు సనా పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ రచయిత కుశ్వంత్‌ సింగ్‌ రచించిన ది ఎండ్‌ ఆఫ్‌ ఇండియా అనే పుస్తకంలోని ఓ సందేశాన్ని సనా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశారని విపరీతంగా ప్రచారం నడుస్తుంది.

ఈ చట్టంపై అన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా విపరీతమైన చర్చ నడుస్తోంది. సనా పెట్టిన పోస్టుపై పలువురు స్వాగతించారని, మరికొందరు నెటిజన్లు వ్యతిరేకించారని వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించారు. సనాను గంగూలీ వెనకెసుకొచ్చారు. వివాదాలకు సనాను దూరంగా ఉంచాలని గంగూలీ కోరిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News