Tokyo Paralympics: పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం
* పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో సింగ్‌రాజ్‌కు కాంస్యం * ఫైనల్లో 216.8 పాయింట్లు సాధించిన సింగ్‌రాజ్
ఎయిర్ పిస్టల్‌లో సింగ్‌రాజ్‌కు కాంస్యం (ట్విట్టర్ ఫోటో)
Tokyo Paralympics: పారాలింపిక్స్ లో మన అథ్లెట్లు దూసుకెళ్తున్నారు. సోమవారం ఒక్కరోజే ఐదు మెడల్స్ గెలవగా ఇవాళ షూటింగ్‌లో మరో మెడల్ భారత్ ఖాతాలో చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్‌లో సింఘ్‌రాజ్ అధానా బ్రాంజ్ మెడల్ గెలిచాడు. ఫైనల్లో అతడు 216.8 పాయింట్లు సాధించాడు. దీంతో భారత్ ఇప్పటి వరకూ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 8కి చేరింది. ఇందులో రెండు గోల్డ్, నాలుగు సిల్వర్, మరో రెండు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.