Shikhar Dhawan: క్రికెట్ కు శిఖర్ ధావన్ రిటర్మైంట్ ప్రకటన

Shikhar Dhawan:భారత జట్టు బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ధావన్ సోషల్ మీడియాలో వీడియో ద్వారా పోస్ట్ చేశాడు.

Update: 2024-08-24 02:47 GMT

Shikhar Dhawan: క్రికెట్ కు శిఖర్ ధావన్ రిటర్మైంట్ ప్రకటన

Shikhar Dhawan: భారత క్రికెట్ జట్టు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన,2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత జట్టులో భాగమైన శిఖర్ ధావన్, ఆగస్టు 24 ఉదయం క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయానికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. శిఖర్ ధావన్ ఇప్పుడు నా క్రికెట్ ప్రయాణంలో ఈ అధ్యాయాన్ని ముగించుకుంటున్నాను అని క్యాప్షన్‌లో రాశాడు.

లెక్కలేనన్ని జ్ఞాపకాలను నాతో తీసుకెళ్తున్నాను. మీ అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు! జై హింద్! అంటూ రాసుకొచ్చాడు. ప్రపంచ క్రికెట్‌లో విజయవంతమైన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లలో ధావన్ మంచి గుర్తింపు సాధించాడు. అతను చివరిసారిగా 2022లో బంగ్లాదేశ్ పర్యటనలో ఆడిన వన్డే సిరీస్‌లో భారత జట్టు తరపున ఆడాడు.



Tags:    

Similar News