Shika Pandey on Cricket: పిచ్‌ల సైజ్‌ను తగ్గించాలానే ఆలోచనలు అర్థరహితం

Update: 2020-06-29 05:24 GMT

Shika Pandey on Cricket: అంతర్జతీయం క్రికెట్ మండలి ( ఐసీసీ ) రూల్స్‌ను సడలించడం కంటే మూలాలపై దృష్టిసారిస్తే మహిళల క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతుందని భారత వెటరన్‌ పేసర్‌ శిఖా పాండే అభిప్రాయపడింది. మహిళల క్రికెట్ లో బంతి సైజుతో పాటు వికెట్ల మధ్య దూరాన్ని తగ్గిస్తే...క్రికెట్ మరింత మందిని అట్రాక్ట్ చేస్తుందని ఐసీసీ నిర్వహించిన వెబినార్‌లో టీమిండియా బ్యాట్స్ఉమెన్ జెమీమా రోడ్రిగ్స్, కివీస్ కెప్టెన్ సోఫియా డివైన్ సూచించారు. అయితే ఈ సలహాలను శిఖా పాండే కొట్టిపారేసింది. ప్రేక్షకుల ఆదరణ కోసం మహిళల క్రికెట్‌లో చిన్న బంతులను వాడడం, పిచ్‌ల సైజ్‌ను తగ్గించడం లాంటి ఆలోచనలు చేయడం అర్థం లేని పనులని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా శిఖా మాట్లాడుతూ..'మా ఆట అభివృద్ధి కోసం చాలా విషయాలు వింటున్నా.. నా ఉద్దేశంలో ఇవన్నీ ఉపయోగంలేనివి. మహిళల క్రికెట్ అభివృద్ధి చేందాలంటే సూచనలు ఎలా ఉన్నాయంటే వంద మీటర్ల రేసులో మహిళా స్ప్రింటర్‌ను 80 మీటర్లు పరుగెత్తించి విజేతగా ప్రకటించినట్టే ఉంటుందినీ శిఖా ఎద్దేవా చేశారు. అంతేకాదు దాని వల్ల పురుష అథ్లెట్స్ టైమింగ్‌ను కూడా అధిగమించవచ్చు. బౌండరీ సైజును తగ్గించడం లాంటి పనులు అస్సలు చేయవద్దు. ఇటీవలి కాలంలో మాలోనూ పవర్‌ హిట్టర్స్‌ను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు మరింతగా రాణిస్తాంమని శిఖా ధీమా వ్యక్తం చేసింది.

కాకపోతే పురుషుల క్రికెట్‌తో మహిళల ఆటను పోల్చవద్దు. మహిళలు క్రికెట్ అభివృద్ధి చెందాలంటే కాస్త ఓపిక అవసరం అని అన్నారు. జట్టులో చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్లున్నారు. క్రీడలను మరింత మార్కెటింగ్ చేయడం ద్వారా అనుకున్న అభివృద్ధిని సాధించవచ్చనీ.. మహిళల క్రీడలను ఓ ప్రత్యేకంగా పరిగణించాలి. 2020 మార్చి 8న ఇదే మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌ ను చూసేందుకు 86,174 మంది లైవ్ టెలికాస్ట్‌ను ఎంజాయ్ చేశారనే విషయాన్ని మర్చిపోవద్దని ఈ పేసర్‌ చెప్పుకొచ్చింది. శిఖా పాండే టీమిండియా తరపున 104 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 113 వికెట్లు సాధించింది.


Tags:    

Similar News