చెల్లెలి పెళ్లి లో సానియా మీర్జా హంగామా!
సానియా మీర్జా సోదరి వివాహం క్రికెటర్ అజహరుద్దీన్ తనయుడితో ఈనెల మూడో వారంలో జరగనుంది.
భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సోదరి ఆనమ్ మిర్జా రెండో వివాహం చేసుకుంటున్నారు. ఇప్పటికె ఈ వివాహ వేడుకలు మొదలైపోయాయి. సానియా మీర్జా చెల్లెలు ఆనమ్ మిర్జా తన మాజీ భర్త అక్బర్ రషీద్ నుంచి ఆమె విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె ప్రముఖ క్రికెటర్ అజహరుద్దీన్ తనయుడు అసదుద్దీన్ తో ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమకి ఇరువురు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వీరి వివాహానికి సన్నాహాలు మొదలయ్యాయి.
ఈనెల మూడో వారంలో వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే వేడుకలు మొదలైపోయాయి. ఈ వేడుకల్లో సానియా మీర్జా హంగామా నడుస్తోంది. ఆమె వేడుకల్లో ఉత్సాహంగా పాలు పంచుకుంటున్నారు. అదీ కాకుండా వివాహ వేడుకలకు సంబంధించి ప్రతీ విషయాన్ని ఆమె ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవలే తన కుమారుడితో కల్సి ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేశాఋ. అవి విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఇప్పుడు తాజాగా తన సోదరి వివాహంలో మెహందీ వేడుక లో ఆమె పాల్గొన్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇప్పుడు అవి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.