Sachin Tendulkar: స‌చిన్ దాతృత్వం

Sachin Tendulkar: భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో త‌నకంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న క్రికెట్ రారాజు సచిన్ టెండూల్కర్ మ‌రో సారి త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. గిరిజ‌న పిల్ల‌ల క‌డుపు నింప‌డానికి ముందుకు వ‌చ్చారు.

Update: 2020-09-13 16:55 GMT

సచిన్ టెండూల్కర్ 

Sachin Tendulkar: భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో త‌నకంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న క్రికెట్ రారాజు సచిన్ టెండూల్కర్ మ‌రో సారి త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. గిరిజ‌న పిల్ల‌లకు చేయూతనివ్వడానికి ముందుకు వ‌చ్చారు. సచిన్ టెండూల్కర్ కేవలం క్రికెట్‌లోనే కాక ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించాడు. తాజాగా ప్రముఖ ఎన్‌జీఓ సంస్థతో కలిసి ఆర్థికంగా వెనుకబడిన 560 గిరిజన చిన్నారులకు చేయుత ఇవ్వనున్నాడు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లోని సేహోర్‌ జిల్లాల్లో (గ్రామీణ ప్రాంతాలు) సేవా కుటిర్స్‌ను పరివార్‌ సంస్థ నిర్మించింది.

మరోవైపు సేవానియా, బీల్‌పాటి, కాపా తదితర గ్రామాలలో మధ్యాహ్న‌ భోజనం, ఉచిత విద్యను టెండూల్కర్‌ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాలలో పోషకాహార లోపం, నిరక్షరాస్యత తదితర సమస్యలను పత్రికలో చూసి సచిన్‌ గిరిజన గ్రామాలలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు.

2019 డిసెంబరులో, టెండూల్కర్ 'స్ప్రెడ్ హ్యాపీనెస్ ఇన్డియా ఫౌండేషన్' ద్వారా, ముంబైలోని భివాలిలోని ప‌లు ప్రాంతాల విద్యార్థుల‌కు డిజిటల్ తరగతి గదులను నిర్వ‌హించ‌డానికి చేయూత‌నిచ్చారు.  

Tags:    

Similar News