Sachin Anjali Love Story: ప్రేమ కోసం అబద్దమాడిన సచిన్.. కుటుంబానికి అంజలీని ఎలా పరిచయం చేశాడంటే? ఆసక్తికర విషయాలు మీకోసం..!
Happy Birthday Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్, అంజలి ఎయిర్‌పోర్ట్‌లో మొదటిసారి కలుసుకున్నారు. అక్కడే ఇద్దరూ ఒకరినొకరు చూసి ప్రేమలో పడ్డారు. అయితే, వీరి ప్రేమ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారంట.
Sachin Anjali Love Story: ప్రేమ కోసం అబద్దమాడిన సచిన్.. కుటుంబానికి అంజలీని ఎలా పరిచయం చేశాడంటే? ఆసక్తికర విషయాలు మీకోసం..!
Sachin Anjali Love Story: భారత క్రికెట్ జట్టు దిగ్గజ క్రికెటర్, క్రీడా ప్రపంచంలో 'క్రికెట్ దేవుడు'గా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్.. ఈ రోజు తన 50వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. కేవలం 16 ఏళ్ల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించిన సచిన్.. మూడు దశాబ్దాలకు పైగా క్రికెట్ ఫీల్డ్‌లో తనదైన ఆటతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆ సమయంలో సచిన్ తన పేరిట అనేక రికార్డులను కూడా నెలకొల్పాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ సచిన్ సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో.. ఏ ఆటగాడు బద్దలు కొట్టడం చాలా కష్టమైన ప్రపంచ రికార్డులు కూడా చాలానే ఉన్నాయి.
క్రికెట్ మైదానంలో సచిన్ గురించి ఎంత చర్చ జరిగిందో.. అతని ప్రేమ జీవితం కూడా అంతే చర్చనీయాంశమైంది. సచిన్ కంటే 6 ఏళ్లు పెద్దదైన డాక్టర్ అంజలి, సచిన్‌ల ప్రేమకథ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ఈరోజు కథనంలో సచిన్, అంజలిల ప్రేమకథకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను మీముందుకు తీసుకొచ్చాం.
మొదటి సమావేశం..
సచిన్, అంజలి విమానాశ్రయంలో మొదటిసారి కలిశారు. సచిన్ తన ఇంగ్లాండ్ పర్యటన నుంచి తిరిగి వస్తున్నాడు. అంజలి తన తల్లిని రిసీవ్ చేసుకోవడానికి విమానాశ్రయానికి చేరుకుంది. తొలి సమావేశంలోనే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.
అంజలి వైద్య విద్యార్థిని, చదువుపై ఉన్న అనుబంధం కారణంగా ఆమెకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదు. సచిన్‌ని కలిసిన తర్వాత అంజలి క్రికెట్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. క్రమంగా, ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, సుమారు 5 సంవత్సరాలు డేటింగ్ చేశారు. ఆ తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు.
రహస్యంగా కలుసుకోవడం..
సచిన్, అంజలి ఒకరినొకరు కలుసుకోవడం కోసం చాలా కష్టపడ్డారంట. అలాగే చాలా ఇబ్బందులు కూడా పడ్డారంట. సచిన్‌ని కలవడానికి వెళ్లినప్పుడు తనను ఎవరు గుర్తుపడతారోనని చాలా భయపడేదానినంటూ అంజలి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఎవరైనా సచిన్‌ని గుర్తిస్తే.. అతనికి ఇబ్బందిగా ఉండేదని, ఆ తర్వాత మా ప్రేమపై చాలా వార్తలు పుట్టుకొచ్చేవంటూ పేర్కొంది.
అంజలి కోసం అబద్ధం చెప్పిన సచిన్..
అంజలి తన కుటుంబాన్ని కలవడానికి సచిన్ ఓ అబద్ధం చెప్పాడు. సచిన్ తన కుటుంబ సభ్యులకు అంజలిని పరిచయం చేయడానికి వెనుకాడాడు. ఈ క్రమంలో అంజలిని జర్నలిస్ట్‌గా మార్చి తన కుటుంబ సభ్యులను కలిసేలా చేశాడు.
1995లో వివాహం..
సచిన్, అంజలి 5 సంవత్సరాల పాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన తర్వాత 24 మే 1995న వివాహం చేసుకున్నారు. సచిన్, అంజలి వివాహమైన 2 ఏళ్ల తర్వాత ఈ జోడీకి కుమార్తె సారా 12 అక్టోబర్ 1997న జన్మించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 24, 1999న, కొడుకు అర్జున్ జన్మించాడు.