IPL 2025 Final: ఎట్టకేలకు ట్రోఫీని ముద్దాడిన బెంగళూరు..పంజాబ్ పై ఘన విషయం..!!

Update: 2025-06-04 00:14 GMT

IPL 2025 Final: ఎట్టకేలకు ట్రోఫీని ముద్దాడిన బెంగళూరు..పంజాబ్ పై ఘన విషయం..!!

IPL 2025 Final: ఎట్టకేలకు విరాట్ కోహ్లీ కల నెరవేరింది. 18ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి..తొలి ట్రోఫిని గెలుచుకుంది. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ ను ముద్దాడింది. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచులో పంజాబ్ కింగ్స్ ను 6 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ఐపీఎల్ 18వ సీజన్ లో 8వ ఛాంపియన్ గా నిలిచింది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో 191 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో పంజాబ్ 184 పరుగులు చేసింది. బెంగళూరు తరపున విరాట్ 35 బంతుల్లో 43 పరుగులు చేశాడు. జితేష్ వేగంగా బ్యాటింగ్ చేసి 240 స్ట్రైక్ రేట్ తో 10 బంతుల్లో 24 పరుగులు చేశాడు. క్రునాల్ పాండ్యా 17పరుగులకు 2 వికెట్ల తీసాడు. భువనేశ్వర్ కుమార్ కూడా 2 వికెట్లు తీశాడు. పంజాబ్ తరపున అర్ష్ దీప్ సింగ్, కైల్ జామిసన్ 3-3 వికెట్లు తీశాడు.


ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు జట్టు 8వ ఛాంపియన్ గా నిలిచింది. దీనికి ముందు చైన్నై 5 సార్లు, ముంబై 5 సార్లు, కోల్ కతా 3 సార్లు, రాజస్థాన్ 1 సారి, డెక్కన్ ఛార్జర్స్ 1, హైదరాబాద్ 1, గుజరాత్ 1 ఛాంపియన్లుగా నిలిచాయి. 

Tags:    

Similar News