Rohit Sharma: ఐపీఎల్‌ కచ్చితంగా జరుగుతుంది : రోహిత్ శర్మ

కరోనా మహమ్మారి ధాటికి అన్ని రంగాలు కుదెలైయ్యాయి. క్రీడారంగాన్ని కూడా ఈ మహమ్మారి వదిలి పెట్టలేదు.

Update: 2020-03-27 09:49 GMT
Rohit Sharma

కరోనా మహమ్మారి ధాటికి అన్ని రంగాలు కుదెలైయ్యాయి. క్రీడారంగాన్ని కూడా ఈ మహమ్మారి వదిలి పెట్టలేదు. అన్ని అంతర్జాతీయ క్రీడలతో పాటు ఈ సీజన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)13వ సీజన్ 2020 వాయిదా పడింది. ముందు అనుకున్నట్లుగా ఈనెల 29వ తేదీ నుంచి ఐపీఎల్‌ ఆరంభం కావాలి దాన్ని ఏప్రిల్‌ 15వరకూ ఆ వాయిదా వేశారు. ఆ తర్వాత జరుగుతుందనమీ లేదు.కాగా.. టీమిండియా ఓపెనర్‌, ముంబై ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మ మాత్రం పరిస్థితులు కుదట పడిన వెంటనే ఐపీఎల్‌ జరుగుతుందని అన్నాడు. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌తో రోహిత్‌శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ చేశారు.

ఈ సందర్భంగా ఐపీఎల్ నిర్వహణపై సందిగ్ధత గురించి కెవిన్ పీటర్సన్‌ ప్రశ్నించాడు. పీటర్సన్ అడిగిన ప్రశ్నకు రోహిత్ సమాధానం ఇస్తూ. ఐపీఎల్ విషయంలో ఆశాభావంతోనే ఉన్నామని, పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ఐపీఎల్ జరుగుతుందనే విశ్వాసంతో వున్నాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌ కచ్చితంగా జరగడం ఖాయమనితెలిపాడు. అది అత్యంత బాధపెట్టిన క్షణం రోహిత్ శర్మ ముంబై ఇండియన్ కెప్టెన్ గా విజయవంతంగా జట్టును నడిపించడంలో సక్సెస్‌ అయ్యాడు.

ఆస్ట్రేలయాలో మాజీ సారథి రికీ పాంటింగ్‌ తర్వాత ముంబై జట్టుకు రోహిత్‌ కెప్టెన్ గా ఎంపికైయడు. ముంబై రోహిత్ సారధ్యంలో రికార్డు టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. కాగా, నీ క్రికెట్‌ కెరీర్‌లో లోయస్ట్‌ పాయింట్‌ ఏమైనా ఉందా' అని పీటర్సన్‌ అడిగిన మరో ప్రశ్నకు రోహిత్‌ ఉందనే చెప్పాడు. పీటర్సన్ కు జవాబుబిస్తూ.. తన కెరీర్‌లో అత్యంత బాధపడ్డ క్షణం కూడా ఉందని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన టీమిండియా జట్టులో లేకపోవడం తనను అత్యంత బాధపెట్టిన క్షణమని పేర్కొన్నాడు.ఫైనల్‌ మ్యాచ్‌ ముంబైలోనే జరిగిందని, తన సొంత గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్ లో లేకపోవడం ఇంకా బాధపడ్డానన్నాడు.

అప్పటి వన్డే వరల్డ్‌కప్‌(2011) ఆడిన భారత్ జట్టులో చోటు లేకపోవడానికి తాను చేసిన తప్పిదాలు కూడా కారణమన్నాడు. వన్డే ప్రపంచ కప్ ముందు తన చెత్త ప్రదర్శనతో జట్టులోకి ఎంపిక కాలేదని తెలిపాడు.ఈ సందర్భంగా పీటర్సన్ అడిగిన ప్రశ్నలకు రోహిత్ పలు ఆసక్తికర జవాబులు ఇచ్చాడు.ఈ ఏడాది ఆగస్టు లో t20 ప్రపంచ కప్ జరగనుంది.కరోనా ధాటికి ఈ ఏడాది జరిగే ప్రపంచకప్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.


Tags:    

Similar News