IND V AUS 3rd ODI : అరుదైన ఘనత సాధించిన రోహిత్ శర్మ

Update: 2020-01-19 13:53 GMT

ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు. వన్డేల్లో 9వేల పరుగుల సాధించిన క్రికెటర్ల లీస్టులో చేరాడు. 217వ ఇన్నింగ్స్‌లో రోహిత్ ఈ మైలురాయిని చేరుకోగా.. కోహ్లీ 194 ఇన్నింగ్స్‌  9వేల పరుగులు సాధించి ముందు వరుసలో నిలిచాడు. కామిక్స్ వేసిన తొలి ఓవర్ లోనే రెండు పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. 208 ఇన్నింగ్స్‌ల్లో 9వేల దక్షిణాఫ్రికా ప్లేయర్ ఏబీ డివిలియర్స్ రెండో స్థానంలో ఉన్నాడు. గంగూలీకి 228 ఇన్నింగ్స్‌, లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ 235 ఇన్నింగ్స్ 9 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.

 మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ధాటిగా ఆడుతున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తనకు కలిసి వచ్చిన మైదానంలో మరోసారి చెలరేగిపోయాడు. 57 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 15 ఓవర్ లో ఆగర్ బౌలింగ్ అర్థసెంచరీ సింగిల్ తీసి అర్థసెంచరీ చేశాడు. ఈ క్రమంలో కెరీర్ తన 44వ అర్థసెంచరీ ఖాతాలో వేసుకున్నాడు.ప్రస్తుతం రోహిత్ (86పరుగులు,93 బంతుల్లో, 8ఫోర్లు, 4సిక్సు)లతోనూ, కోహ్లీ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 26 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి భారత్ 135 పరుగులు చేసింది. గతంలో ఇదే మైదానంలో ఆసీస్ పై రోహిత్ డబుల్ సెంచరీ సాధించాడు. 

 


Tags:    

Similar News