Rehnuma Bhati: హార్దిక్ పాండ్య, మునాఫ్ పటేల్ నన్ను రేప్ చేశారు
* ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ
Rehnuma Bhati: హార్దిక పాండ్య, మునాఫ్ పటేల్ నన్ను రేప్ చేశారు
Rehnuma Bhati: టీ20 ప్రపంచకప్2021లో ఇప్పటికే తన ఆటతీరుపై పలు విమర్శలు ఎదుర్కున్న టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యపై తాజాగా ఒక మహిళా సంచలన ఆరోపణలు చేసింది. హార్దిక్ పాండ్యతో పాటు భారత మాజీ ఆటగాడు మునాఫ్ పటేల్, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా తనను రేప్ చేశారంటూ ఒక మహిళ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీమ్ కి ప్రధాన అనుచరుడైన రియాజ్ భాటీ భార్య రహనుమా భాటీ ఈ విషయంపై మాట్లాడుతూ తన భర్త రియాజ్ సెక్స్ రాకెట్ నడుపుతున్నాడని.. కొంతమంది ప్రముఖుల వద్దకు తనని పంపేవాడని అందులో హార్దిక్ పాండ్య, మునాఫ్ పటేల్ తో పాటు రాజీవ్ శుక్లా ఉన్నారని తాజాగా ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
మరి ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందో లేదా ఎవరైనా పని గట్టుకొని వీరిపై ఆరోపణలు చేపిస్తున్నారో పోలీసుల దర్యాప్తులో తేలనుంది. అయితే ఆ మహిళా ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ మాత్రం ఫైల్ అవలేదని ఆమె వద్ద ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నారు.