Bengaluru Stampede Case: బెంగళూరు తొక్కిసలాట కేసులో తొలి అరెస్ట్
Bengaluru Stampede Case: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను పోలీసులు అరెస్ట్ చేశారు.
Bengaluru Stampede Case: బెంగళూరు తొక్కిసలాట కేసులో తొలి అరెస్ట్
Bengaluru Stampede Case: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై వెళ్లేందుకు సిద్ధమవుతున్న నిఖిల్‌ను బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
బెంగళూరులో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి నమోదైన కేసులో భాగంగా ఈ అరెస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి చెందిన కొందరు అధికారులను కూడా పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది.
ప్రస్తుతం నిఖిల్ సోసాలేను రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ అరెస్ట్‌పై ఇప్పటివరకు ఆర్సీబీ యాజమాన్యం గానీ, నిఖిల్ సోసాలే కుటుంబ సభ్యులు గానీ అధికారికంగా స్పందించలేదు. అయితే ఈ వార్త క్రీడా వర్గాల్లో వేడెక్కించిన టాపిక్‌గా మారింది.