నాదేం ఉంది.. వాళ్లే ప్రశంసలకు అర్హులు: రాహుల్ ద్రవిడ్

ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే.

Update: 2021-01-24 13:15 GMT
ద్రావిడ్ ఫైల్ ఫోటో 

ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో గాయాలతో సీనియర్ ఆటగాళ్లు దూరమైనా.. నిరాశ చెందని భారత్ యువ ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకొని సత్తా చాటారు. అందుకే ఈ గెలుపు భారత్‌ క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ పెటర్నిటీ లీవ్ మీద కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమవడం.. ఫస్ట్ టెస్ట్‌లో 36 పరుగులకే పరిమితమై ఘోర పరాజయం.. గాయపడుతూ సినీయర్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్టుకు దూరమవడంతో భారత్ పోరాడితే చాలని భావించారంతా.

ద్రవిడ్ ఏ పరిస్థితుల్లోనైనా ఆడగలిగేలా యువ ఆటగాళ్లను మానసికంగా సిద్దం చేశాడని అందరూ దివాల్‌ను ప్రశంసించారు. అయితే ఈ ప్రశంసలపై రాహుల్ ద్రవిడ్ తాజాగా స్పందించారు. తనకు అనవసర క్రెడిట్ ఇస్తున్నారని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో యువ ఆటగాళ్లు రాణించడంలో తన పాత్ర ఏం లేదని, ప్రశంసలన్నిటీకీ వారే అర్హులని ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ అన్నాడు. 'నాకు అనవసర క్రెడిట్ ఇస్తున్నారు. కుర్రాళ్లే అన్ని ప్రశంసలకు అర్హులు'అని ద్రవిడ్ స్పష్టం చేశాడు.

యువ క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, సత్తా చాటడంతో ఆసీస్ చిత్తయింది. అయితే ఈ యువ ఆటగాళ్లు రాణించడానికి కారణం టీమిండియా మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడే కారణమని మాజీ క్రికెటర్లు కొనియాడారు. భారత్-ఏ, అండర్-19 కోచ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News