CSK vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

* చెన్నై సూపర్ కింగ్స్ - పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

Update: 2021-10-07 10:00 GMT

CSK vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్(ట్విట్టర్ ఫోటో)

CSK vs PBKS:  ఐపీఎల్ 2021 లో భాగంగా దుబాయ్ క్రికెట్ స్టేడియంలో నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. తాజాగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ రాహుల్ బౌలింగ్ ఎంచున్నాడు. ప్లేఆఫ్ చేరే అవకాశం చేజార్చుకున్న పంజాబ్ ఈ మ్యాచ్ లో గెలుపుతో ఐపీఎల్ 2021 ని ముగించాలని పట్టుదలతో ఉంది.

ఇక టాప్ 2 లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధించి టేబుల్ లో టాప్ లో నిలవాలని బరిలోకి దిగనుంది. ఈ రోజు మ్యాచ్ లో విజయం సాధించి చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ బ్రేవో కి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలని చెన్నై జట్టు ఆసక్తితో ఎదురుచూస్తుంది.

ఇరు జట్ల వివరాలు ఇలా ఉన్నాయి..

పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, సర్ఫరాజ్ ఖాన్, షారుఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, క్రిస్ జోర్డాన్, హర్‌ప్రీత్ బ్రార్, మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మోయిన్ అలీ, అంబటి రాయుడు, ధోని, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

Tags:    

Similar News