ఆ షాట్స్‌ ఆడటం నేరం కాదు.. వారికి స్వేచ్ఛ ఇవ్వండి

సౌతాణాఫ్రికా వేదికగా అండర్‌-19 వరల్డ్‌కప్‌ జరుగనున్న నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లకు భారత జట్టు ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్‌ శర్మ శుభాకాంక్షలు చెప్పారు.

Update: 2019-12-26 16:51 GMT
Rohit Sharma File Photo

సౌతాణాఫ్రికా వేదికగా అండర్‌-19 వరల్డ్‌కప్‌ జరుగనున్న నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లకు భారత జట్టు ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్‌ శర్మ శుభాకాంక్షలు చెప్పారు. 2020 జనవరి 17 నుంచి అండర్‌-19 ప్రపంచ కప్ జరగనుంది. కాగా, గ్రూప్‌-ఏలో ఉన్న టీమిండియా జనవరి 19వ తేదీన మొదటి మ్యాచ్ శ్రీలంకతో ఆడనుంది.

ప్రపంచకప్‌తో తిరిగి రావాలని ఆకాంక్షించారు. యువ క్రికెటర్లపై ఒత్తిడి పెంచకుండా స్వేచ్చ ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌కు సూచించారు. టీమిండియా క్రికెటర్లకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తే ప్రపంచ సాధించి తీసుకొస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రియాంక్‌ గార్గ్‌ నాయకత్వంలోని అండర్‌-19 జట్టుకు ముందుగా అభినందనలు చెప్పాడు.

ఈ సందర్భంగా టీమిండియా అండర్‌-19 యువ ఆటగాళ్లుకు పలు సూచనలు చేశాడు. కవర్‌ డ్రైవర్‌లతో షాట్లనే కాకుండా భారీ షాట్లు ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలన్నాడు. భారీ షాట్లు ఆడే క్రమంలో యువ ఆటగాళ్లు తప్పులు చేస్తే సరిచేయండని మేనేజ్‌మెంట్‌కు కోరాడు. సహజసిద్ధమైన షాట్లను వద్దని చెప్పి నివారించకండి. క్రికెట్‌ ఆటలో గాల్లో షాట్లను కొడుతూనే పెరిగాం. భారీ షాట్లు సరైనవి కాకపోతే నెట్ ప్రాక్టీస్ లో సరిచేకున్నామని తెలిపారు.

భారీ షాట్లు యత్నించి ఫలితాలు రాబట్టడంతో తప్పులేదన్నారు. ఈ జనరేషన్ లో షాట్లు ఆడాలనుకుంటున్న వారే ఎక్కువగా ఉంటారు. ఆట పరిస్థితులు బట్టి మారాలి. క్రికెటర్‌ పదే పదే ఒకే తరహా తప్పిదం వారి సరిచేసి మరో గేమ్ కు సిద్ధం చేయాలని తెలిపాడు. నా దృష్టిలో భారీ షాట్లు ఆడడం నేరం కాదు. కుర్రాళ్లకు స్వేచ్ఛఇవ్వండి అని రోహిత్ శర్మ మేనేజ్‌మెంట్‌కు విన్నవించాడు 

  

Tags:    

Similar News