బీసీసీఐ తెరపైకి కొత్త ట్విస్ట్ తీసుకొచ్చింది : పాక్ క్రికెట్ బోర్డు
బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబూర్ రెహ్మాన్ జయంతి సందర్భంగా వరల్డ్ ఎలెవన్,ఆసియా ఎలెవన్ జట్లతో మ్యాచ్ నిర్వహించాని భావించింది.
బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబూర్ రెహ్మాన్ వందవ జయంతి సందర్భంగా వరల్డ్ ఎలెవన్, ఆసియా ఎలెవన్ జట్లతో మ్యాచ్ నిర్వహించాని ఆదేశ క్రికెట్ బోర్డు భావించింది. ఈ మేరకు ఐసీసీ కూడా అనుమతి తీసుకుంది. అందుకు ఐసీసీ కూడా అంగీకరించింది. పాక్ చెందిన ఆటగాళ్లు వద్దని పరోక్షంగా తేల్చిచెప్పింది. తొలి టీ20 మ్యాచ్ మార్చి 16వ తేదీన జరగనుంది. ఇక రెండో టీ20 మార్చి 20వ తేదీన జరగనుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం బంగ్లా క్రికెట్ బోర్డు ఐసీసీ అనుమతి తీసుకుంది.
అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అధికారిక హోదాలోనే ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) క్లారిటీ ఇచ్చింది. బీసీసీఐ తమ ఆటగాళ్ల ఆసియా లెవన్ లో ఆడనీయకుండా అడ్డుపడుతుందని ఆరోపించింది. ఈక్రమంలో పీఎస్‌ఎల్ ఉన్నందున ఆసియా ఎలెవన్ టీమ్‌లో భాగం ఆడటానికి తమ క్రికటర్లు ఎవరూ ఆసక్తిగా లేరని పేర్కొంది. ఈ విషయాన్ని ముందుగానే బంగ్లా క్రికెట్ బోర్డుకు తెలిపామని పీసీబీ వెల్లడించింది. అయితే బీసీసీఐ తమ ఆటగాళ్లను అడ్డుకుని కించపరచడమే అవుతుందని వెల్లడించింది. బీసీసీఐ కొత్త ట్విస్ట్ తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించింది.
పాక్ క్రికెటర్లను లేకుండా బంగ్లా, భారత్ వరల్డ్ ఎలెవన్‌తో మ్యాచ్‌లు ఆడితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో బీసీసీఐను విమర్శించింది. పాకిస్తాన్ క్రికెటర్లను ఆసియా లెవన్‌లో అడ్డుకోవడానికి బీసీసీఐ ప్రధాన కారణమని విషం చిమ్మింది.
వరల్డ్ లెవన్,ఆసియా ఎలెవన్‌ల మధ్య జరగబోయే 2 టీ20 మ్యాచ్‌ల సమయంలో పీఎస్‌ఎల్ ఉంది దాంతో తమ క్రికెటర్లు పాల్గొనడం కుదరదు. పీఎస్‌ఎల్ తేదీలను మార్పు అసాధ్యం. వరల్డ్ ఎలెవన్-ఆసియా ఎలెవన్ తేదీలు కూడా మార్చడం కుదరదు. తమ క్రికెటర్లంతా పీఎస్‌ఎల్‌తో బిజీగా గడుపుతారు. ఈ విషయాన్ని ముందుగానే బీసీబీకి తెలియజేశాం వారు కూడా అంగీకరించారని తెలిపింది. అయితే మా ఆటగాళ్లు ఆడితే టీమిండియా క్రికెటర్లు ఆసియా ఎలెవన్‌లో ఆడరని చెప్పడం ఏంటని పీసీబీ ప్రశ్నించింది. మా ఆటగాళ్లను అనుమానించడం ఏంటని పీసీబీ అధికార ప్రతినిధి ప్రశ్నించారు.