IND vs NZ 1st Test 2nd Day : తొలి ఇన్నింగ్స్ గంటలోనే చాపచుట్టేసిన భారత్

Update: 2020-02-22 02:19 GMT
IND VS NZ TEST 2ND Day

వెల్లింగ్టన్‌ వేదికగా కివీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 165 పరుగులకే కుప్పకూలింది. ఓవర్‌నైట్‌ స్కోరు 122/5తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా గంటలోపే చాపచూట్టేసింది. జేమీసన్‌ 39 పరుగులకే నాలుగు వికెట్లు, టిమ్‌ సౌథీ నాలుగు వికెట్లు తీసి భారత బ్యాట్స్‌మెన్‌ వెన్నువిరిచారు. రెండో రోజు ఆటలో భారత్ మరో 43 పరుగులే జోడించి చివరి అయిదు వికెట్లు కోల్పోయింది.

రెండో రోజు బరిలోకి దిగిన కొద్దిసేపటికే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రహానె (46), పంత్‌ (19) మధ్య సమన్వయం లోపించడంతో పంత్‌ రనౌటయ్యాడు. ఆదిలోనే వికెట్ పంత్ వికెట్ కోల్పోవడంతో కష్టాల్లో పడింది. అజాజ్‌ పటేల్‌ వేసిన త్రోబాల్ నేరుగా వికెట్లకు తాకడంతో పంత్‌ ఔటైయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అశ్విన్‌ సౌథీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత రహానె, ఇషాంత్ శర్మ (5) కూడా పెవిలియన్‌ చేరారు. అయితే చివరల్లో మహ్మద్ షమీ (20) బ్యాటు ఝళిపించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 165 పరుగులు చేయగలిగింది.

అనంతరం బరిలోకి దిగిన కివీస్ ఓపెనర్లు టామ్‌ లాథమ్‌ (11) వద్ద ఇషాంత్ పెవిలియన్ దారి పట్టించాడు. మరో ఓపెనర్ టామ్‌ బ్లండెల్‌ (30*), కెప్టెన్ విలియమ్సన్ (19*) జాగ్రత్తగా ఆడుతున్నారు. భారత బౌలర్లు ఇషాంత్ వికెట్ తీశాడు. టీమిండియా ఒక రివ్యూను కోల్పోయింది. బుమ్రా బంతికి బ్లండెల్ ఎల్బీడబ్ల్యూగాని రివ్యూ కోరగా నాటౌట్‌ అని తేలింది. దీంతో టీమిండియాకు ఒక రివ్యూ మాత్రమే మిగిలి ఉంది.  




Tags:    

Similar News