ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన కివీస్

Update: 2019-11-25 08:07 GMT

బే ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ పై జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 353/10 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ జట్టు 615/9 చేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ జట్టు బ్యాట్స్‌మెన్స్‌లో వాట్లింగ్(205పరుగుల్లో, 473 బంతులు, 24 ఫోర్లు, 1సిక్స్ ) డబుల్ సెంచరీ చేశాడు. మరో ఆటగాడు శాంట్నర్ సెంచరీలో రాణించాడు. నాలుగో రోజు 55/3 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆంభించిన 197 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. న్యూజిలాండ్ బౌలర్లలో నీల్ 5 వికెట్లు, శాంట్నర్ 3 వికెట్లు తీసుకున్నారు.

Tags:    

Similar News