Neeraj Chopra: నీరజ్ చోప్రా సరికొత్త ప్రయాణం.. ‘వెల్ స్పోర్ట్స్’ పేరుతో సొంత క్రీడా సంస్థ ప్రారంభం!
Neeraj Chopra: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) క్రీడారంగంలో మరో కీలక అడుగు వేశారు.
Neeraj Chopra: నీరజ్ చోప్రా సరికొత్త ప్రయాణం.. ‘వెల్ స్పోర్ట్స్’ పేరుతో సొంత క్రీడా సంస్థ ప్రారంభం!
Neeraj Chopra: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) క్రీడారంగంలో మరో కీలక అడుగు వేశారు. గత పదేళ్లుగా తన వెన్నంటి ఉన్న 'జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్' (JSW Sports) సంస్థ నుంచి విడిపోయి, ‘వెల్ స్పోర్ట్స్’ (Vel Sports) అనే తన సొంత క్రీడా నిర్వహణ సంస్థను ప్రారంభించారు.
జేఎస్‌డబ్ల్యూతో దశాబ్ద కాలపు ప్రయాణం
2016 నుంచి నీరజ్ చోప్రా జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌తో కలిసి పనిచేస్తున్నారు. అనామక అథ్లెట్ స్థాయి నుంచి ఒలింపిక్ ఛాంపియన్‌గా ఎదిగే క్రమంలో ఆ సంస్థ అందించిన సహకారాన్ని నీరజ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. "నా కెరీర్‌లో జేఎస్‌డబ్ల్యూ నిర్ణయాత్మక పాత్ర పోషించింది. అక్కడ నేను నేర్చుకున్న విలువలు, అనుభవాలను నా తదుపరి ప్రయాణంలోనూ కొనసాగిస్తాను" అని నీరజ్ చోప్రా భావోద్వేగంగా వెల్లడించారు.
శుభాకాంక్షలు తెలిపిన జేఎస్‌డబ్ల్యూ
నీరజ్ తీసుకున్న ఈ నిర్ణయంపై జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ సీఈఓ దివ్యాంశ్షు సింగ్ సానుకూలంగా స్పందించారు. దశాబ్ద కాలం పాటు నీరజ్‌తో కలిసి పనిచేయడం తమకు గర్వకారణమని, ఒక వ్యవస్థాపకుడిగా ఆయన ప్రారంభించిన ‘వెల్ స్పోర్ట్స్’ మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మారిన క్రీడా ముఖచిత్రంలో అథ్లెట్లు తమ సొంత బ్రాండ్‌లను నిర్మించుకోవడంలో భాగంగా నీరజ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు క్రీడా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.