IPL 2025: ముంబై ఇండియన్స్‌ నరేంద్ర మోదీ స్టేడియం 'శాపం' బ్రేక్ చేయగలరా? పంజాబ్‌పై గెలిచి ఫైనల్‌కు వెళ్తారా?

IPL 2025: ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో నేడు, జూన్ 1, 2025న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.

Update: 2025-06-01 04:45 GMT

IPL 2025: ముంబై ఇండియన్స్‌ నరేంద్ర మోదీ స్టేడియం 'శాపం' బ్రేక్ చేయగలరా? పంజాబ్‌పై గెలిచి ఫైనల్‌కు వెళ్తారా?

IPL 2025: ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో నేడు, జూన్ 1, 2025న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఫైనల్‌లో ఇప్పటికే చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతుంది. ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌ను గెలవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ స్టేడియంలో వారి చెత్త రికార్డును బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఫైనల్‌లో తమ స్థానాన్ని పక్కా చేసుకోవాలంటే, సంవత్సరాలుగా వెంటాడుతున్న ఒక 'శాపం' నుంచి బయటపడాలి.

ముంబై ఇండియన్స్ జట్టుకు నరేంద్ర మోడీ స్టేడియంలో గత కొంతకాలంగా ప్రదర్శన చాలా నిరాశపరిచింది. ఈ మైదానంలో వారు ఆడిన గత ఐదు మ్యాచ్‌లలోనూ ఓడిపోయారు. ఇందులో ఐపీఎల్ 2023 క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఓటమి కూడా ఉంది. ఆ మ్యాచ్‌లో గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేసి 233 పరుగులు చేయగా, ముంబై జట్టు కేవలం 171 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ముంబై ఇండియన్స్ ఈ మైదానంలో చివరిసారిగా గెలిచింది 2014లో మాత్రమే. అంటే, వారు గత 11 సంవత్సరాలుగా ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరియు కోచ్ మహేల జయవర్ధనేలకు ఈ ఓటముల పరంపరను బ్రేక్ చేయడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు Do or Die పరిస్థితి. ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ముంబై క్వాలిఫైయర్ 2కు చేరుకుంది. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శన చేసి, జట్టును 20 పరుగుల తేడాతో గెలిపించారు. మరోవైపు, పంజాబ్ కింగ్స్ క్వాలిఫైయర్ 1లో ఓడిపోయి ఈ మ్యాచ్ ఆడుతోంది. రెండు జట్లు ఫైనల్‌లో చోటు దక్కించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతాయి. ఇప్పటికే ఫైనల్‌కు చేరిన ఆర్‌సీబీతో ఎవరు తలపడతారో ఈ మ్యాచ్‌లో తేలిపోతుంది.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఎప్పుడూ నువ్వా నేనా అన్నట్లుగానే మ్యాచ్‌లు ఉంటాయి. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 33 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ముంబై ఇండియన్స్ 17 మ్యాచ్‌లలో గెలిచింది. పంజాబ్ కింగ్స్ 16 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ సీజన్‌లో (IPL 2025) లీగ్ స్టేజ్‌లో రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఈ గణాంకాలు ఈరోజు మ్యాచ్ ఎంత ఉత్కంఠగా ఉంటుందో తెలియజేస్తున్నాయి.

Tags:    

Similar News