IPL 2020 : ఫ్రాంచైజీల టార్గెట్ వీరే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 వేలానికి రంగం సిద్ధమైంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 వేలానికి రంగం సిద్ధమైంది. ఈ సారి వేలంలో 332 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఈ వేలంలో ఎనిమిది ప్రాంచైజీలు 73మంది క్రికెటర్లను ఎంపిక చేసుకోనున్నారు. డిసెంబర్ 19 ఈ వేలానికి ఈసారి బెంగళూరుకి బదులుగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా వేదిక కానుంది.
అయితే ఈ సారి వేలంలో 29 మంది విదేశి ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా, భారత దేశవాళి క్రికెటర్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే వేలం ముందు బీసీసీఐ దేశవాళి టోర్నిలు నిర్వహించింది. అయితే ఈ టోర్నీలో సత్తాచాటిని యువ ఆటగాళ్లను ప్రాంచైజీలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ఈ సంవత్సరం ఐపీఎల్ వేలానికి ముందు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే సీజన్ కోసం వేలంలో ఫ్రాంఛైజీలు సత్తా ఉన్న యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సాయి కిషోర్ ప్రాథమిక ధర: రూ. 20 లక్షలు
తమిళనాడు జట్టుకు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ సాయి కిషోర్ గత ఏడాది ఐపీఎల్ లో ఛాన్స్ మిస్సైయ్యాడు. కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ప్రసిద్ధుడు. పరుగులు పొదుపు చేయగలడు. పవర్ ప్లేలో బౌలింగ్‌తో బాగా పాపులర్ కూడా..ముస్తాక్ అలీ టోర్నీలో 4.63 బౌలింగ్ సగటుతో 20 వికెట్లు పడగొట్టాడు. తమిళనాడు జట్టు ఫైనల్‌కు చేరడంలో సాయి కిషోర్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ప్రారంభ ధర రూ. 20 లక్షలు ఉన్న సాయి కిషోర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది.
యశస్వీ జైస్వాల్ ధర- రూ. 20 లక్షలు
ఈ ఏడాది కాలంలో దేశవాళీ క్రికెట్‌లో కొందరూ భారత క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు. వారిలో కొందరి జాబితాను పరిశీలించినట్లయితే,
యశస్వీ జైస్వాల్ ముంబైకి చెందిన ఈ 17 ఏళ్ల కుర్రాడు విజయ్ హజారే ట్రోఫీలో సత్తాచాటాడు. యశస్వీ జైస్వాల్ చేసిన ప్రదర్శన అండర్-19 వరల్డ్ కప్‌లో స్థానం సంపాదించి పెట్టింది. పిన్న వయసులో టీమిండియా ఏ జట్టు తరపున డబుల్ సెంచరీ కొట్టిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు.
ప్రియం గార్గ్ ప్రాథమిక ధర- రూ. 20 లక్షలు
అండర్-19 వరల్డ్ కప్‌లో టీమిండియా సారథిగా వ్యవహరించనున్న ప్రియం గార్గ్ కోసం ప్రాంచైజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. విజయ్ హజారే ట్రోఫీ పది మ్యాచ్‌ల్లో 814 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. 12 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ఆడి 867 పరుగులతో మంచి ట్రాక్ రికార్డు సొంతం చేసుకున్నాడు.
రోహన్ ప్రాథమిక ధర - రూ. 20 లక్షలు
కర్ణాటక టీమ్ వరుసగా రెండోసారి ముస్తాక్ అలీ ట్రోఫీ సొంతం చేసుకుందనంటే అందలో ప్రధాన భూమిక రోహన్ పోషించాడు. రోహన్ కదం తొక్కడంతోనే కర్ణాటక ఘనవిజయం సాధించింది. అయితే ఈ సీజన్‌లో 129.78 సగటుతో 536 రాబట్టిన రోహన్ యాంకర్ రోల్ పోషించడంలో రాటుతేలాడు.
విరాట్ సింగ్ ప్రాథమిక ధర -రూ. 20 లక్షలు
జార్ఖండ్‌కు చెందిన ఈ యువ ఆటగాడు విరాట్ సింగ్ దేశవాళి టోర్నీల్లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ముస్తాక్ అలీ టోర్నీలో 343 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో 335 పరుగులు చేయడమే కాకుండా 100కు పైగా స్ట్రయిక్ రేట్‌తో సత్తాచాటాడు. జార్ఖండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.