దాదా మార్క్.. చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ ఔట్ ?

ఎంఎస్‌కే ప్రసాద్‌పై అంబటి రాయుడు కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తీరుకు నిరసనగా భారత జట్టుకు రిటైర్మింట్ ప్రటించిన విషయం తెలిసిందే.

Update: 2019-12-28 13:40 GMT
MSK Prasad, Sourav Ganguly,

టీమిండియా క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ తీరుపై సినీయర్ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్న సంగతి తెలిసిందే. ఇటీవల టీమిండియా మాజీ ఆటగాడు స్పిన్నర్ హర్భజన్ సింగ్ శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్ కు జట్టు ఎంపికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యకుమార్ ను ఎందుకు తీసుకోలేదో సెక్షన్ కమిటీ చెప్పాలని నిలదీశారు. అంతే కాకుండా సెక్షన్ కమిటీ విషయంతో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఒక నిర్ణయం తీసుకుంటాడని ఆశిస్తున్నా అంటూ ట్విట్ చేశాడు. ఎంఎస్‌కే ప్రసాద్‌పై అంబటి రాయుడు కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తీరుకు నిరసనగా భారత జట్టుకు రిటైర్మింట్ ప్రటించిన విషయం తెలిసిందే.

కాగా..ఈ నేపథ్యంలో చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ను తప్పించాలనే వాదనలు బలంగా వినిపించాయి. అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువగా క్రికెట్‌ ఆడిన అనుభవం లేని ఎంఎస్‌కే ప్రసాధ్‌ను చీఫ్‌ సెలక్టర్‌గా కొనసాగించడంపై వెటరన్‌ క్రికెటర్ల కూడా విస్మయం వ్యక్తం చేశారు. చీఫ్‌ సెలక్టర్‌గా ఎంఎస్‌కే సక్సెస్‌ క్రికెట్‌ జట్టును ఎంపిక చేసే క్రమంలో అతనికి నిబద్ధత లేదని పలు విమర్శలు. అయితే అందుకు ముందుడగు పడినట్లే కనిపిస్తుంది.

తాజాగా గంగూలీ హిందూస్తాన్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.. సెలక్షన్‌ కమిటీలో మార్పులు ప్రక్షాళ తప్పదని వ్యాఖ్యానించాడు. సెలక్షన్‌ కమిటీని ఒకేసారి మార్చాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పాడు. ఒకరిద్దరిని మార్చితే సరిపోతుందని, త్వరలో ఏర్పాటు చేయనున్న క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) చూసుకుంటుందన్నాడు. సీఏసీ ఏర్పాటు తర్వాత సెలక్షన్ కమిటీలో మార్పులు ఉంటాయని వ్యాఖ్యానించాడు.

అయితే తాజాగా గంగూలీ నిర్ణయంతో ఎంఎస్‌కే ప్రసాద్‌కు ఉ‍ద్వాసన తప్పక పోవచ్చనే ప్రచారం సాగుతుంది. ఎంఎస్‌కే ప్రసాద్ పదవీ కాలం గతంలో ఆరు నెలల పొడిగించారు. చీఫ్‌ సెలక్టర్‌గా మూడేళ్లు పని చేసిన ఎమ్మెస్కే ప్రసాద్ కొనసాగాడు. దీంతో ఎంఎస్‌కే మార్పు అనివార్యం. ఇక తర్వాత చీఫ్ సెలక్టర్ ఎవరనే దానిపై ఊహాగానాలు మొదలైయ్యాయి. ప్రస్తుతం పదవీలో ఉన్న వారిని కొనసాగించాలా లేక చీఫ్‌ సెలక్టర్‌ను, మరొక సెలక్టర్‌ను ఎంపిక చేస్తే సరిపోతుందా అనే ఆలోచనలో బీసీసీఐ ఉంది.

 

Tags:    

Similar News