MS Dhoni: సౌతిండియా హీరోలా అదిరిపోయిన ధోనీ ఎంట్రీ
MS Dhoni: ఐపీఎల్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని మైదానంలోకి ఎంటీ ఇస్తే చాలు స్టేడియం మొత్తం అభిమానుల కరతాళ ధ్వనులతో మార్మోగిపోతుంది.
MS Dhoni: సౌతిండియా హీరోలా అదిరిపోయిన ధోనీ ఎంట్రీ
Dhoni: ఐపీఎల్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని మైదానంలోకి ఎంటీ ఇస్తే చాలు స్టేడియం మొత్తం అభిమానుల కరతాళ ధ్వనులతో మార్మోగిపోతుంది. కానీ ఈసారి టోర్నమెంట్లో ప్రారంభం కాకముందే అతడి ఎంట్రీ సంచలనం సృష్టించింది. ఐపీఎల్ 2025 మార్చి 22 నుండి ప్రారంభం కావాల్సి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మార్చి 23న తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇందులో ధోని చాలా నెలల తర్వాత ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌కు అతను ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాడు. దీని కోసం తను చెన్నై చేరుకున్నాడు. ఎయిర్ పోర్టులో అతను మోర్స్ కోడ్ ఉన్న టీ-షర్టు ధరించి సౌతిండియా హీలో లెవల్లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ధోనీ టీ-షర్ట్, తన ఎంట్రీ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.
ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా మూడు వారాల సమయం ఉంది. దీనికి ముందు సీఎస్ కే ఒక ప్రాక్టీస్ క్యాంప్ నిర్వహిస్తోంది. దీనిలో పాల్గొనడానికి ధోని చెన్నై చేరుకున్నాడు. అతను ఎయిర్ పోర్టు దిగిన విధానం సౌత్ హీరోలా ఉంది. వైరల్ వీడియోలో, ధోని చుట్టూ భారీ భద్రతా దళాలు మోహరించి ఉన్నారు. ధోని అందరి మధ్య నవ్వుతూ, బ్లాక్ గాగుల్స్, నల్ల టీ-షర్టు ధరించి నడుస్తూ కనిపించాడు. హీరో ఎంట్రీ ఇచ్చినప్పుడు సినిమాల్లో కూడా ఇలాగే ఉంటుంది. ధోనీ టీ-షర్ట్ మీద మోర్స్ కోడ్ ప్రింట్ అయి ఉంది. అది ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. చాలా మంది అభిమానులు దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చని భావిస్తున్నారు.
ధోని టీ-షర్ట్ వార్తల్లోకి ఎందుకు వచ్చింది?
ధోని చెన్నైకి రాకతో ఆయన అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. అతను తమ అభిమాన క్రికెటర్ టోర్నీలో ఆడడం చాలా హ్యాపీగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ ఈసారి ధోని మాత్రమే కాదు.. తను వేసుకున్న నల్లటి టీ-షర్ట్ కూడా వార్తల్లో నిలుస్తోంది. దానిపై మోర్స్ కోడ్‌లో ఒక మెసేజ్ రాశారు. ఈ కోడ్ 19వ, 20వ శతాబ్దాలలో రహస్య సందేశాలను పంపడానికి ఉపయోగించేవారు. సైన్యంలో విస్తృతంగా ఇలాంటి మెసేజ్ లను ఉపయోగించారు. కొంతమంది అభిమానులు దానిని డీకోడ్ చేసి 'వన్ లాస్ట్ టైమ్' అని పేర్కొన్నారు. ఈ ఐపీఎల్ సీజన్ తనకు చివరిదని ధోని సూచించాడని ఇప్పుడు ఊహాగానాలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో సీజన్ ముగిసిన తర్వాతే తెలుస్తుంది.