15 Years of Dhonism: భారత క్రికెట్‌లో గ్రేట్ ఫినిషర్‌

ప్రపంచ క్రికెట్‌కు హెలికాఫ‌్టర్ షాట్ అంటే గుర్తుకు వచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని.

Update: 2019-12-23 11:47 GMT

ప్రపంచ క్రికెట్‌కు హెలికాఫ‌్టర్ షాట్ అంటే గుర్తుకు వచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని. హెలికాఫ్టర్ రెక్కల్లా బ్యాట్‌ను గుండ్రగా తిప్పుతూ.. ధోనీ కొట్టే సిక్సులు అద్భుతంగా ఉంటాయి. ధోనీ హెలికాఫ్టర్ షాట్ కొడితే బంతి స్టేడియం వెలుపలకు వెళ్లాల్సిందే. ధోనీ ఆడిన ఈ షాట్స్ ప్రపంచ క్రికెటర్లలో యువ ఆటగాళ్లు అడేందు ప్రయత్నించారు. అయితే ఎవరూ సక్సెస్ కాలేదు. అలాంటి ధోని అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి ఇవాళ్టికి 15 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ధోనికి అభిమానులు, క్రికెటర్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


1983 తర్వాత భారత్‌కు రెండు విభిన్న ఫార్మాట్లలో ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ ధోని ఒక్కరే. 15 ఏళ్ల క్రితం గంగూలీ సారథ్యంలో ఉన్న టీమిండియాలో అడుగుపెట్టాడు ధోని. బంగ్లా‌దేశ్‌తో జరిగిన వన్డేలో తన వికెట్ కీపర్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఆ మ్యాచ్ లో ధోని రనౌట్‌గా వెనుదిరిగాడు. మూడు మ్యాచ్‌ల కేవలం 19 పరుగులే చేసి నిరాశపరిచాడు. 2005లో ధోని కెరీర్‌ మలుపు తిరిగింది. విశాఖ వన్డేలో పాకిస్థాన్ పై 148 పరుగులు 123 బంతుల్లో సాధించి తానేంటో నిరుపించుకున్నారు.


వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధోని రికార్డు సృష్టించాడు. పంచంలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా ధోని పేరు పొందాడు. తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అద్భుతమైన ఆటతీరుతో జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాధించుకున్నాడు. టీమిండియా ఎందరో సీనియర్లు ఉన్న తన కంటూ ప్రత్కేక స్థానాన్ని సంపాధించడమే కాకుండా రాహుల్ ద్రావిడ్ తర్వాత కలర్ డ్రస్ ఫార్మాట్ కు కెప్టెన్ గా చేశాడు.


దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన పొట్టి ఫార్మాట్ లో ధోని నాయకత్వంలో భారత్ కు ప్రపంచకప్ తెచ్చిపెట్టాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఆ మ్యాచ్ ఇండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఐదు పరుగుల తేడాతో ఓడించింది. 2011లో సొంతగడ్డపై ధోని నాయకత్వంలోని భారత జట్టు రెండు దశాబ్దాల తర్వాత వన్డే ప్రపంచ కప్ సాధించింది. ధోని కెప్టెన్సీలో టీమిండీయా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ టోఫ్రీని సాధించింది. మూడు ఫార్మాట్లో కలిపి 17,266 పరుగులు చేశాడు.



ఇటీవలే ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ధోని క్రికెట్ కు దూరమైయ్యాడు. భారత ఆర్మీకి సేవలందించేందుకు తాత్కాలిక విరామం తీసుకున్నారు. ప్రపంచ కప్ ధోని ఆడిన న్యూజిలాండ్ పై ఆడిన మ్యాచ్ చివరి మ్యాచ్. అయితే ధోని పునరాగమనంపై చర్చలు నడుతుస్తున్నాయి. ధోని అభిమానలు మళ్లీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారు. 15 ఏళ్ల సుధీర్ఘ కెరీర్ లో ఇంత గ్యాప్ ధోని ఎప్పుడు తీసుకోలేదు. అయితే ధోని తన కెరీర్ పై జనవరి తర్వాత వెల్లడిస్తాన్నారు. ధోని అభిమానులు మాత్రం ధోనికి రిప్లేస్‌మెంట్‌ దొరకలేదు అంటూ ట్వీట్ చేస్తున్నారు. ధోని లేని భారత జట్టును ఊహించుకోవడమే కష్టంగాఉంది అంటూ మరో అభిమాని సోషల్ మీడియా ట్వీట్ చేస్తున్నారు. 


Tags:    

Similar News