IPL Most Sixes: ఐపిఎల్ చరిత్రలో సిక్సర్ల హీరోలు వీరే..!!

Update: 2021-08-03 12:51 GMT

ఐపిఎల్ (ట్విట్టర్ ఫోటో)

IPL Most Sixes: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపిఎల్) అంటే భారత క్రికెట్ అభిమానులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ సీజన్ మొదలైందంటే చాలు తమ అభిమాన జట్టుకు సపోర్ట్ చేస్తూ టీవిలకు, ఫోన్లలో మ్యాచ్ చూడటానికి అతుక్కుపోతారు జనాలు. తమ అభిమాన క్రికెటర్ ఏ జట్టులో ఉంటే ఆ జట్టుని తమ సొంత జట్టులా భావించే అభిమానులు ప్రతి మ్యాచ్ గెలవాలని కప్ గెలవాలనే కోరుకుంటారు. ఇక పొట్టి క్రికెట్ అంటేనే హిట్టింగ్ అందులోను చివరి ఓవర్లలో చేసే పరుగులు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంటాయి. అలాంటింది మన ఐపీఎల్ ఇప్పటివరకు చివరి ఓవర్ (20)లో అత్యధిక సిక్స్ లు కొట్టిన లిస్టులో ఎవరు ఉన్నారో ఒకసారి చూద్దాం..

ఇక కెరీర్ మొదటి నుండి తన ఆటతో తన ప్రవర్తనతో కోట్లాది మంది ప్రజలను అభిమానం గెలుచుకొని మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకున్న ఎమ్ఎస్ ధోని ఈ చివరి ఓవర్లో అత్యధిక సిక్సులు కొట్టి ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. బెస్ట్ ఫినిషర్ గా పేరున్న ధోని ఐపీఎల్ 20వ ఓవర్లో ఇప్పటివరకు 49 సిక్సులు బాది మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక రెండవ స్థానంలో పోలార్డ్ 27 సిక్సులతో, మూడవ స్థానంలో రోహిత్ శర్మ 23, నాలుగవ స్థానంలో హార్దిక్ పాండ్య 23, రవీంద్ర జడేజా 15 సిక్సులతో అయిదవ స్థానంలో నిలిచాడు. టాప్ 5 లో "మిస్టర్360" ఉంటాడనుకున్న ఒకటి రెండు సిక్స్ లతో కొంత వెనుకబడిన మోస్ట్ సిక్స్ లలో మాత్రం మన డివిలియర్స్ రెండో స్థానంలో ఉన్నాడు.

ఇక ఇప్పటివరకు ఐపిఎల్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన టాప్ 5 ఆటగాళ్ళు ఇలా ఉన్నారు..

1.క్రిస్ గేల్ (349)

2.ఏబి డివిలియర్స్ (235)

3.ధోని (216)

4.రోహిత్ శర్మ (213)

5.విరాట్ కోహ్లి (201)

Tags:    

Similar News