Maruti Suzuki Ciaz: మారుతి ఆణిముత్యం..ఈ కారు మార్కెట్లో ఇక కనిపించదు..!

Maruti Suzuki Ciaz: దేశీయ మార్కెట్‌లో మారుతి సుజుకి కార్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మారుతి వ్యాగన్ ఆర్, బాలెనో వంటి వాహనాలు భారీ అమ్మకాలను సాధిస్తున్నాయి.

Update: 2025-02-23 11:30 GMT

Maruti Suzuki Ciaz: మారుతి ఆణిముత్యం..ఈ కారు మార్కెట్లో ఇక కనిపించదు..!

Maruti Suzuki Ciaz: దేశీయ మార్కెట్‌లో మారుతి సుజుకి కార్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మారుతి వ్యాగన్ ఆర్, బాలెనో వంటి వాహనాలు భారీ అమ్మకాలను సాధిస్తున్నాయి. అదే సమయంలో కస్టమర్లు అసలు ఇష్టపడని కంపెనీ లైనప్‌లో ఒక కారు ఉంది. మారుతి సుజుకి భారతదేశంలో తన ప్రముఖ సెడాన్ సియాజ్ విక్రయాలను నిలిపివేయడానికి సిద్ధమవుతోంది.

ఇండస్ట్రీ వర్గాల లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 2025 నాటికి మారుతి సియాజ్ అమ్మకాలు నిలిపివేయనుంది. మారుతి సియాజ్ విక్రయాలు నిరంతరం క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 2025 నాటికి దీని ఉత్పత్తి నిలిచిపోవచ్చని సమాచారం.

అయితే ఈ విషయమై మారుతి సుజుకి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సియాజ్ దేశీయ విపణిలో 2014లో విడుదలైంది. అయితే సియాజ్ డీజిల్ మోడల్‌ను ప్రారంభించిన తర్వాత, అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఈ కారణంగా కంపెనీ కారును నిలిపివేయబోతోంది. ఈ సెడాన్ ధర, ఫీచర్లను ఒకసారి చూద్దాం.

మారుతి సుజుకి సియాజ్ ప్రారంభ ధర రూ. 9.40 లక్షలు ఎక్స్-షోరూమ్. టాప్ వేరియంట్ ధర రూ. 12,29,500 ఎక్స్-షోరూమ్. మీరు 7 వేరియంట్ ఎంపికలలో కొనచ్చు. ఈ సెడాన్ హోండా సిటీ, స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నా వంటి కార్లతో పోటీపడుతుంది.

సియాజ్‌లో 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సాఫ్ట్ టచ్ డ్యాష్‌బోర్డ్, లెదర్ అప్హోల్స్టరీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరాతో వెనుక AC వెంట్లు, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

భద్రత కోసం ఈ సెడాన్‌లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు, బ్రేక్ అసిస్ట్ ,డ్రైవర్ + ప్యాసింజర్ సైడ్ సర్క్యులర్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

మారుతి సుజుకి సియాజ్ కాంపాక్ట్ సెడాన్ 1.5-లీటర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌ ఉంది. ఈ ఇంజన్ 104హెచ్‌పి పవర్, 138 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సియాజ్‌ను 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ ఆటోమేటెడ్ గేర్ షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది. లీటర్ పెట్రోల్‌తో 20.65 కిమీల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

Tags:    

Similar News