Tendulkar And Kohli : సహాయానికి క్రికెటర్లు రాలే.. కానీ సోనూసూద్ వచ్చాడు!
Tendulkar And Kohli : లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కష్టాలు అంతా ఇంతా కాదు... వారిని ఆదుకోవడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు అందులో
Ashraf bhai
Tendulkar And Kohli : లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కష్టాలు అంతా ఇంతా కాదు... వారిని ఆదుకోవడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు అందులో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఒకరు.. వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్ దేవుడుగా నిలిచాడు. ఇప్పుడు కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు సోనూసూద్.. లాక్ డౌన్ సమయంలోనే కాదు.. ఇప్పటికీ ఎవరికీ ఏ సమస్య వచ్చిన ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాడు.. నిజానికి సోనూసూద్ సినిమాల్లో విలన్ అయినప్పటికీ అందరి దృష్టిలో ఇప్పుడు రియల్ హీరో... దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన, విన్నాగాని సోనూసూద్ పేరే వినిపిస్తుంది.
తాజాగా మరొకరికి బాసటగా నిలిచాడు సోనుసూద్.. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి లాంటి గొప్ప క్రికెటర్ల బ్యాట్ లను రిపేర్ చేసిన అప్రష్ భాయ్ కి అండగా నిలిచాడు సోనుసూద్.. ముంబైకి చెందిన అప్రష్ భాయ్ కిడ్నికి ఆపరేషన్ కి కావాల్సిన డబ్బు కోసం ఎదురుచూస్తున్నాడు.. అయితే దీనిపైన ఓ నెటిజన్ నటుడు సోనుసూద్ కి ట్వీట్ చేయగా అతను స్పందించాడు. అప్రష్ భాయ్ అడ్రస్ చెప్పండి అంటూ సోనుసూద్ స్పందించాడు..చాలా మంది క్రికెటర్లకి బ్యాట్ లను రిపేర్ చేసిన అప్రష్ భాయ్ ని ఒక్కరు పట్టించుకోకున్నా.. సోనుసూద్ ముందుకు రావడం పట్ల నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
पता ढूँढो इस भाई का। https://t.co/QiwEoy5vjK
— sonu sood (@SonuSood) August 22, 2020