liverpool Crowned Premier League: ఈపీఎల్‌ విజేత లివర్‌పూల్‌.. మూడు దశబ్దాల నిరీక్షణకు తెర

liverpool Crowned Premier League: ఎట్టకేలకు మూడు దశాబ్దాల తర్వాత ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఈపీఎల్‌) టైటిల్‌ను లివర్‌పూల్‌ జట్టు సొంతంచేసుకుంది.

Update: 2020-06-27 10:06 GMT

ఎట్టకేలకు మూడు దశాబ్దాల తర్వాత ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఈపీఎల్‌) టైటిల్‌ను లివర్‌పూల్‌ జట్టు సొంతంచేసుకుంది. కరోనా వైరస్‌ కారణంగా మూడు నెలల తర్వాత కట్టుదిట్టమైన జాగ్రత్తల మధ్య ఈపీఎల్‌ లీగ్‌లో గురువారం రాత్రి మాంచెస్టర్‌ సిటీతో తలపడిన చెల్సీ 2-1 తేడాతో విజయం సాధించింది. 2019లో ఒక పాయింట్‌ తేడాతో మాంచెస్టర్‌ సిటీ (98)కి టైటిల్‌ చేజార్చుకున్న కసిని కొనసాగిస్తూ.. ఈసారి ఎలాగైనా కొట్టాలన్న ధ్యేయంతో బరిలోకి దిగిన లివర్‌పూల్‌ (97) చరిత్ర లిఖించింది.ఈపీఎల్‌ కప్‌ను1990 తర్వాత లివర్‌పూల్‌ మళ్లీ ఇప్పుడు ముద్దాడింది. అంతే కాదు 1888 నుంచి ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు మిగిలుండగానే కప్‌ను దక్కించుకున్న తొలి జట్టుగా నిలిచింది.

లివర్‌పూల్‌ ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించి 86 పాయింట్లతో టాప్‌ నిలిచింది. మాంచెస్టర్‌ సిటీ (63), లీసెస్టర్‌ సిటీ (55), చెల్సియా (54)లు.. లివర్‌పూల్‌ దరిదాపుల్లో కూడా లేవు. మాంచెస్టర్‌ సిటీతో తలపడిన చెల్సి 2-1తో విజయం సాధించడంతో లివర్‌పూల్‌కు కప్‌ ఖరారైంది. ఇక పాయింట్ల పట్టికలో మాంచెస్టర్‌ ర ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సీజన్‌లో లివర్‌పూల్‌ జట్టు 31 మ్యాచ్‌ల్లో 86 పాయింట్లు సాధించి ప్రస్తుతం మాంచెస్టర్‌ కంటే 23 పాయింట్ల ముందంజలో ఉంది. మాంచెస్టర్‌ సిటీ 7 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అవన్నీ గెలిచినా.. సిటీ 84 పాయింట్లకే చేరుకుంటుంది. దీంతో 1990 తర్వాత లివర్‌పూల్‌ తొలిసారి ప్రీమియర్‌ లీగ్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈపీఎల్‌ టైటిల్‌ను లివర్‌పూల్ రికార్డు స్థాయిలో 19వ సారి గెలుచుకోవడం మరో విశేషం.


Tags:    

Similar News