Virat Kohli: ఆ టైంలో ఒంటరినయ్యా: విరాట్ కోహ్లి

ఇంగ్లాండ్ లో 2014 లో పర్యటించినపుడు నేను ఒంటరిగా ఉన్నానని చాలా బాధపడ్డానని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ క్లోహ్లి అన్నాడు.

Update: 2021-02-19 12:59 GMT

విరాట్ కోహ్లీ ఫైల్ ఫోటో


ఇంగ్లాండ్ లో 2014 లో పర్యటించినపుడు నేను ఒంటరిగా ఉన్నానని చాలా బాధపడ్డానని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ క్లోహ్లి అన్నాడు. ఈ సమయంలో బ్యాటింగ్ లో వరుసగా విపలమవడంతో కుంగుబాటుకు గురయ్యాయని తెలిపాడు. ఇంగ్లాంగ్ మాజీ ప్లేయర్ మార్క నికోలస్ నిర్వహించిన నాట్ జస్ట్ క్రికెట్ పాడ్ కాస్ట్ లో తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠిన దశపై మాట్లాడాడు.

ఆ పర్యటనలో ఇంగ్లాండ్ తో భారత్ ఐదు టెస్టులు ఆడగా.. అందులో కోహ్లి వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6, 20 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తం పది ఇన్సింగ్సుల్లో కేవలం 13.50 సగటు సాధించాడు. అనంతరం ఇండియా టీమ్ ఆసీస్ టూర్ కు వెళ్లింది. ఆస్ట్రేలియా పర్యటనలో తిరిగి ఫామ్ లోకి వచ్చిన కోహ్లి 692 పరుగులు సాధించి సత్తా చాటాడు.

ప్రతి క్రికెటర్ ఎదో ఒక దశలో ఇబ్బందులు ఎదుర్కొంటాడని, అలాంటి కఠినమైన దశను ఇంగ్లాండ్ పర్యటనలో అనుభవించానని కోహ్లి తెలిపాడు. ఆ సమయంలో నా జీవితంలో అండగా నిలిచేవాళ్లున్నా..ప్రపంచంలో నేను మాత్రమే ఒంటరిగా ఉన్నానని అనిపించేది. మాట్లాడేందుకు చాలా మందే ఉన్నా.. నా మనసులో ఏముందో తెలుసుకునే వారు లేరని ఫీలయ్యానన్నారు. కుంగుబాటు అనేది నా జీవితంలో చాలా పెద్ద విషయం. ఈ పరిస్థతి నుంచి త్వరగా బయటపడాలని కోరుకున్నానని అన్నాడు. ఆ సమయంలో అసలు నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదని, పొద్దున్నే లేవాలని కూడా అనిపించేది కాదన్నాడు. ఇలాంటి సమయంలో నిపుణుల సహాయం చాలా అవసరమని పేర్కొన్నాడు.

1990ల్లోని భారత జట్టును చూసే క్రికెట్ లోకి రావాలని బలంగా నిర్ణయించుకున్నానని, నమ్మకం, బలమైన నిర్ణయాలు తీసుకుంటే అద్భుతాలు జరుగుతాయని బలంగా నమ్మేవాడినని తెలిపారు. నిజ జీవితంలో ఉన్నట్లే.. మైదానంలో కూడా ఉంటానని పేర్కొన్నారు. 'వ్యక్తిగతంగా నేను ఏం చేస్తానన్నదే నాకు ముఖ్యమని, అంచనాల గురించి ఆలోచిస్తే భారంగా ఉంటుందని' విరాట్ తెలిపాడు.

Tags:    

Similar News