Kevin Peterson vs Dhoni: ధోనీపై కెవిన్ పీటర్సన్ వరుస ట్రోల్స్...విషయం ఏంటంటే?

*ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ధోనీని ట్రోల్ చేస్తున్నాడు. ఆరేళ్ల కిందట ఐపీఎల్ సందర్భంగా ఇరువురి మధ్య సరదాగా ప్రారంభం అయిన ఈ ఫైట్..ఇంకా చల్లారలేదు..వరుస ట్వీట్లతో ధోనీని కేపీ ట్రోల్ చేస్తున్నాడు. ఒకదాని తర్వత ఒకటి వీడియోలను అప్ లోడ్ చేస్తూ ఇదిగో సాక్ష్యాలు అంటూ రెచ్చగొడుతున్నాడు.

Update: 2023-05-18 04:39 GMT

Kevin Peterson vs Dhoni: ధోనీపై కెవిన్ పీటర్సన్ వరుస ట్రోల్స్...విషయం ఏంటంటే?

Kevin Peterson vs Dhoni: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ వీలు చిక్కినప్పుడల్లా మహేంద్రసింగ్ ధోనీని ట్రోల్ చేశాడు. వరుస ట్వీట్లతో ధోనీపై కామెంట్స్ చేస్తున్న పీటర్సన్ మరో అడుగు ముందుకేశాడు. ధోనీ తీసిన తొలి వికెట్ తనది కాదంటూ ఇందుకు సంబంధించిన వీడియోని సాక్ష్యంగా చూపించాడు. నిజానికి వీరిద్దరి మధ్య వివాదం ఈనాటిది కాదు ఐపీఎల్ 2017తో మొదలు అయింది. ధోనీ కంటే మంచి గోల్ఫర్నంటూ పీటర్సన్ అన్నాడు. దీనికి బదులుగా నువ్వే నా తొలి వికెట్ అంటూ కెవిన్ పీటర్సన్ కు ధోనీ రిప్లయ్ ఇచ్చాడు. నాటి నుంచి ఈ విషయమై పీటర్సన్ వీలు చిక్కినప్పుడల్లా క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ట్వీట్ చేయడమే కాకుండా..వీడియోని సైతం షేర్ చేశాడు..

2011లో లార్డ్స్ మైదానం వేదికగా భారత్ – ఇంగ్లాండ్ ఓ టెస్టు మ్యాచ్ ఆడాయి. అప్పుడు ఇంగ్లాండ్ 217/3 స్కోర్ వద్ద పీటర్సన్ బ్యాటింగ్ చేస్తుండగా ధోనీ బౌలింగ్ చేశాడు. ధోనీ వేసిన ఓ బంతికి కేపీ వికెట్ల వెనక దొరికిపోయాడు. ధోనీతో పాటు అందరూ అపీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. దానికి పీటర్సన్ డీఆర్ ఎస్ కు వెళ్లడంతో నాటౌట్ గా తేలింది. అయినా అప్పటి నుంచి ధోనీతో పాటు అతడి ఫ్యాన్స్...పీటర్సన్ ను పలు సందర్భాల్లో ఆటపట్టించారు. ధోనీకి టెస్టులో అతడే తొలి వికెట్ అని సరదాగా అంటుంటారు.

ధోనీకి తాను తొలి వికెట్ కాదని వీడియోని షేర్ చేసిన కేపీ మరో వీడియోని కూడా షేర్ చేశాడు. తానే ధోనీ వికెట్ తీశానంటూ ఆ వీడియోని పోస్ట్ చేశాడు. ఈ మ్యాచ్ 2007లో ఓవల్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో ధోనీని కేపీ ఔట్ చేశాడు. మొత్తానికి, ఎప్పుడో జరిగిపోయిన ఉదంతాన్ని కెవిన్ పీటర్సస్ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తుంటే కెప్టెన్ కూల్ గా ముద్ర పడిన మహీ మాత్రం రియాక్ట్ కాకుండా కేపీని మరింతగా ఆటపట్టించేస్తున్నాడు. 

Full View


Full View


Tags:    

Similar News