SRH: కెప్టెన్సీ నుంచి వార్నర్ తొలగించిన హైదరాబాద్

Update: 2021-05-01 11:07 GMT

David Warner

ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సారథ్య బాధ్యతల నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించింది. డేవిడ్ వార్నర్‌ కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథిగా నియమించింది. తాజా సీజన్‌లో 6 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ కేవలం ఒకే 1 మ్యాచ్‌లో విజయం సాధించింది. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక స్లో బ్యాటింగ్‌‌తో నిరాశపరిచిన డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌ ఓటమికి పూర్తి బాధ్యత తానే వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News