Hardik Pandya: కొత్త‌ ప్రియురాలి ఫోటో లీక్ చేసిన హ‌ర్ధిక్ పాండ్యా…ఇంత‌కీ మహికా శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Hardik Pandya: క్రికెట్ స్టార్ హార్దిక్ పాండ్యా ప్రేమ కథలో కొత్త మలుపు.. అభిమానులకు ‘బర్త్ డే’ ట్రీట్!

Update: 2025-10-11 00:30 GMT

Hardik Pandya: కొత్త‌ ప్రియురాలి ఫోటో లీక్ చేసిన హ‌ర్ధిక్ పాండ్యా…ఇంత‌కీ మహికా శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంపై ఉన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. సెర్బియా మోడల్ నటాషాతో విడాకులు తీసుకున్న తర్వాత ఎవరితో డేటింగ్‌లో ఉన్నాడన్న ఉత్కంఠకు ముగింపు పలికాడు. తాజాగా, మోడల్ మహికా శర్మతో తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించి, అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు.



జాస్మిన్ కాదు.. ఈమెనే!

నటాషాతో విడాకుల తర్వాత పాండ్యా.. మోడల్ జాస్మిన్ వాలియాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం హోరెత్తింది. అయితే, దీనిపై అటు హార్దిక్ కానీ, ఇటు జాస్మిన్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ గుసగుసలు సద్దుమణగక ముందే, పాండ్యా మరో కొత్త మోడల్‌తో డేటింగ్‌లో ఉన్నాడన్న రూమర్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో, తన పుట్టినరోజు (అక్టోబర్ 11) సందర్భంగా, ఒక రోజు ముందుగానే (శుక్రవారం, అక్టోబర్ 10) తన కొత్త ప్రియురాలు మహికా శర్మతో కలిసి ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, అన్ని అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టాడు.

బర్త్ డే వేడుకలను మహికాతో కలిసి హార్దిక్ జరుపుకున్న ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో, హార్దిక్-మహికా రిలేషన్‌షిప్ అధికారికంగా కన్ఫార్మ్ అయినట్లయింది.




 


ఎవరీ మహికా శర్మ..? పాండ్యా కంటే ఏడేళ్లు చిన్నది!

హార్దిక్ పాండ్యా ప్రియురాలిని పరిచయం చేయడంతో, క్రికెట్ అభిమానులు ఇప్పుడు 'మహికా శర్మ' గురించి గూగుల్‌లో వెతుకుతున్నారు. ఇంతకీ ఎవరీ మోడల్?

మహికా శర్మ వయసు 27 ఏళ్లు. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ, హార్దిక్ పాండ్యా కంటే ఏడేళ్లు చిన్నది.

చదువు: ఈమె ఆర్ధిక శాస్త్రం, ఫైనాన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. కొంతకాలం కొన్ని కంపెనీల్లో ఇంటర్న్‌గా కూడా పనిచేసింది.

కెరీర్: మోడలింగ్‌పై ఉన్న ఆసక్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టింది. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి గుర్తింపు పొందింది.

ప్రముఖ పాత్రలు: ర్యాపర్ రాజాతో కలిసి చేసిన ఒక వీడియో సాంగ్‌తో మహికాకు మంచి క్రేజ్ లభించింది.

సినిమాలు-అవార్డులు: అంతేకాదు, ‘పీఎం నరేంద్ర మోడీ’ బయోపిక్‌లో చిన్న పాత్ర పోషించింది. 2024 ఇండియన్ ఫ్యాషన్ అవార్డ్స్‌లో ‘మోడల్ ఆఫ్ ద ఇయర్ (న్యూ ఏజ్)’ అవార్డును గెలుచుకుంది.

మొత్తంగా, తన ప్రేమ రహస్యాన్ని పాండ్యా బయటపెట్టడంతో, ఈ కొత్త జంటపై ఇప్పుడు క్రీడా, సినీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News