Sehwag: తప్పంతా ధోనీ టీమ్ మేట్‌దే.. ఇప్పుడీ ఓవరాక్షన్ ఎందుకు? సెహ్వాగ్ హాట్ కామెంట్స్
Sehwag: ఈ మ్యాచ్‌లో కోహ్లీ, బెతెల్, రొమారియో షెఫర్డ్ అర్ధశతకాలు RCBకి 213 పరుగుల భారీ స్కోరు అందించాయి.
Sehwag: తప్పంతా ధోనీ టీమ్ మేట్‌దే.. ఇప్పుడీ ఓవరాక్షన్ ఎందుకు? సెహ్వాగ్ హాట్ కామెంట్స్
Sehwag: ఐపీఎల్ 2025లో బెంగళూరు వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. అయితే మ్యాచ్ ముగిసినా, చర్చలన్నీ డేవాల్డ్ బ్రెవిస్ వికెట్ చుట్టూనే తిరుగుతున్నాయి. మొదటి బంతికే డక్ అయ్యిన బ్రెవిస్ తప్పు ఎవరిదీ అన్న ప్రశ్నపై వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
17వ ఓవర్లో లుంగి ఎన్‌గిడీ వేసిన ఫుల్‌టాస్ బంతి బ్రెవిస్‌ను ప్యాడ్‌పై తాకగా, అంపైర్ నితిన్ మీనన్ వెంటనే ఔట్‌గా ప్రకటించారు. అదే సమయంలో బాల్ డెడ్ అయిపోయి 15 సెకన్ల రివ్యూ టైమర్ ప్రారంభమైంది. కానీ బ్రెవిస్ తక్కువ ఓవర్ల మ్యాచ్ అయినా కూడా ఒక పరుగు చేసి తర్వాతే రివ్యూ కోరాడు. అప్పటికి టైమర్ ముగిసిపోయింది. దీంతో అతడు పెవిలియన్‌కి వెళ్లాల్సి వచ్చింది.
తర్వాత రీప్లేలో బాల్ స్టంప్‌ను మిస్ అవుతున్నట్టు స్పష్టమైంది. ఒకవేళ రివ్యూ తీసుంటే, బ్రెవిస్ ఔట్ కాకుండా మైదానంలో ఉండేవాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ, తప్పు అంపైర్‌ది కాదని, బ్రెవిస్‌కు ఆటపై అవగాహన లేకపోవడం వల్లే ఈ స్థితి వచ్చిందని అన్నారు. 15 సెకన్ల టైమర్‌ను గ్రౌండ్‌లో స్పష్టంగా చూపిస్తున్నప్పుడు రివ్యూ ఆలస్యం చేయడం అతడి బాధ్యతారాహిత్యమేనన్నారు.
మరోవైపు, మాజీ ఆటగాడు మనోజ్ తివారీ దీనిపై భిన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. సీనియర్ ఆటగాడిగా జడేజా స్వయంగా రివ్యూ కోరాల్సిందని తెలిపారు. ఈ విషయంలో జడేజా కూడా తప్పుదారిలో ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, బెతెల్, రొమారియో షెఫర్డ్ అర్ధశతకాలు RCBకి 213 పరుగుల భారీ స్కోరు అందించాయి. షెఫర్డ్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి, ఐపీఎల్‌లో రెండో వేగవంతమైన అర్ధశతకం నమోదు చేశాడు. చివర్లో అద్భుతంగా ఆడిన మాత్రే, జడేజా పోరాడినప్పటికీ చెన్నై రెండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది.