IND vs AUS: గిల్ కెప్టెన్సీకి బ్యాడ్ స్టార్ట్ రానుందా? ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు హెచ్చరిక

భారత క్రికెట్‌లో ఇప్పుడు అధికారికంగా శుభ్‌మన్ గిల్ శకం ప్రారంభమైంది. టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, గిల్‌ను ఇప్పుడు వన్డే జట్టుకు కూడా కెప్టెన్‌గా చేశారు.

Update: 2025-10-07 05:41 GMT

IND vs AUS: గిల్ కెప్టెన్సీకి బ్యాడ్ స్టార్ట్ రానుందా? ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు హెచ్చరిక

IND vs AUS: భారత క్రికెట్‌లో ఇప్పుడు అధికారికంగా శుభ్‌మన్ గిల్ శకం ప్రారంభమైంది. టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, గిల్‌ను ఇప్పుడు వన్డే జట్టుకు కూడా కెప్టెన్‌గా చేశారు. టీ20 జట్టులో వైస్ కెప్టెన్‌గా నియమించారు. అంటే ఇప్పుడు జట్టు నాయకత్వానికి గిల్ నే పెద్ద ముఖం. అయితే అతన్ని కెప్టెన్‌గా చేసిన వెంటనే టీమిండియాకు విజయాలు వస్తాయా? ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్‌లో గిల్ టీమిండియాను గెలిపించగలడా? బీసీసీఐ, సెలక్షన్ కమిటీ ఇదే ఆశతో అతన్ని నియమించాయి, కానీ అతని కెప్టెన్సీ ప్రారంభం అంత బాగా ఉండదని ఆస్ట్రేలియా నుంచి ఓ అంచనా వచ్చింది.

భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన అక్టోబర్ 19న ప్రారంభమవుతుంది. ఈ పర్యటన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో మొదలవుతుంది, ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. ఈ పర్యటనలో ముఖ్యంగా వన్డే సిరీస్‌పైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఇందులో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కొహ్లీ, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడుతూ కనిపిస్తారు. అలాగే, ఈ సిరీస్‌తో వన్డే కెప్టెన్‌గా గిల్ బాధ్యతలు కూడా మొదలవుతాయి. రోహిత్-విరాట్‌ల ప్రదర్శనతో పాటు, గిల్ కెప్టెన్సీలో భారత జట్టు ఎలా ఆడుతుందనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా వైపు నుంచి ప్రకటనలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక ప్రకటనలో రోహిత్, విరాట్‌లను పరోక్షంగా ఎగతాళి చేస్తున్నాడు. అయితే, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఏకంగా గిల్ కెప్టెన్సీకి బ్యాడ్ ఓపెనింగ్ ఉంటుందని జోస్యం చెప్పాడు. ఐసీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఫించ్ మాట్లాడుతూ.."ఇది అద్భుతమైన సిరీస్ అవుతుంది. భారతదేశంతో ఎప్పుడూ బాగానే ఉంటుంది, విరాట్ తిరిగి వచ్చాడు, అతను ఎప్పుడూ ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా బాగా ఆడతాడు" అని అన్నాడు.

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఫించ్ మాట్లాడుతూ..కాగితాలపై చూస్తే ఇది ఎప్పుడూ ఒక గొప్ప పోటీలాగే కనిపిస్తుంది, కానీ ఆస్ట్రేలియా 2-1తో (సిరీస్) గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇది అంత ఈజీగా ఉండదు, ఎందుకంటే భారత్ ఒక స్ట్రాంగ్ జట్టు" అని అన్నాడు. ఫించ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే, గిల్ కెప్టెన్సీలో టీమిండియాకు ఓటమి తప్పదని ఆయన పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తోంది.

మొదటి వన్డే అక్టోబర్ 19న పెర్త్‌లో, రెండవ వన్డే అక్టోబర్ 23న అడిలైడ్‌లో, మూడవ వన్డే అక్టోబర్ 25న సిడ్నీలో జరుగుతుంది. 2019 తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ ఆడటం ఇదే మొదటిసారి. అప్పుడు విరాట్ కొహ్లీ టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు.

Tags:    

Similar News