IPL-2021 Auction: వేలంలో ఫ్రాంచైజీల కళ్లు ఈ 16ఏళ్ల కుర్రాడిపైనే

ఐపీఎల్‌ -2021సీజన్ 14 మినీ వేలం ప్రక్రియ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది.

Update: 2021-02-12 15:16 GMT

Noor Ahmad

ఐపీఎల్‌ -2021సీజన్ 14 మినీ వేలం ప్రక్రియ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ గురువారం ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈ సారి ఐపీఎల్ కు మొత్తంగా 1,114 మంది ప్లేయర్లు పేరు రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీల విజ్ఞాప్తి మేరకు 292 మంది ఆటగాళ్లను ఫైన్ చేసింది. వేలంలో మొత్తం 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. అన్ని జట్లలో 61 స్థానాలు ఖాళీగా ఉండగా.. అత్యధికంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో 13, అత్యల్పంగా సన్‌రైజర్స్‌ లో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

బీసీసీఐ తాజాగా ప్రకటించిన జాబితా ప్రకారం అతిపిన్న వయసు ఆటగాడు ఎవరో తెలుసా?. ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు స్పిన్నర్‌ నూర్ అహ్మద్. ఇతడి వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్‌ బిగ్ ‌బాష్ లీగ్‌లో సత్తాచాటాడు. వేలంలో ఫ్రాంచైజీల దృష్టి ఈ కుర్రాడిపైనే ఉంది. దీంతో నూర్ అహ్మద్‌ను ఫ్రాంచైజీలు ఈ సారి వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్‌ 2021 వేలంలో ఉన్న అత్యంత వయసైన ఆటగాడు నయన్ దోషి. ఈయన వయసు 42 సంవత్సరాలు. భారత మాజీ క్రికెటర్ దిలిప్ దోషి కుమారుడే ఈ నయన్.

నయన్ జోషి గతంలో రాజస్థాన్ రాయల్స్ (2010), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2011) ప్రాతినిధ్యం వహించాడు. నయన్ నాలుగు ఐపీఎల్ మ్యాచ్‌లలో 8.46 ఎకానమీ రేటుతో 2 వికెట్లు పడగొట్టాడు. భారత్ నుంచి హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్ మాత్రమే రూ.2 కోట్ల కనీస ధర జాబితాలో ఉన్నారు. అలాగే మరో 8 మంది విదేశీ క్రికెటర్లను సైతం రూ.2కోట్ల బేస్‌ప్రైస్‌ జాబితాలో చేర్చారు.

మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, స్టీవ్‌ స్మిత్‌, షకీబ్ అల్ హసన్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్, మార్క్ వుడ్ ఉన్నారు. రూ.1.5 బేస్‌ప్రైజ్‌ కేటగిరిలో 12 మందిని, రూ.కోటి కేటగిరిలో హనుమ విహారి, ఉమేశ్‌యాదవ్‌ సహా 11 మందిని చేర్చారు.

Tags:    

Similar News