IPL2020: అతడి స్థానంలో మురళి విజయ్ బెటర్: శ్రీకాంత్
IPL2020: మరికొద్ది రోజుల్లో యూఈఏ వేదికగా ఐపీఎల్ క్రీడాసమరం ప్రారంభం కానున్నది. అన్ని జట్టు సన్నదమవుతున్నాయి.
Kris Srikkanth Backing Murali Vijay
IPL2020: మరికొద్ది రోజుల్లో యూఈఏ వేదికగా ఐపీఎల్ క్రీడాసమరం ప్రారంభం కానున్నది. అన్ని జట్టు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అనూహ్యంగా ఐపీఎల్ 2020 నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఆటగాడు సురేశ్ రైనా స్థానంలో మరో ఫ్లేయర్‌ను భర్తీ చేయడానికి ప్రాంచైజీ తర్జన భర్జనలు పడుతున్నది. ఈ తరుణంలో రైనా స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడు మురళి విజయ్ అని టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ కే. శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.
సీఎస్‌కే జట్టులో రైనా కీలక పాత్ర పోషించాడని అన్నారు. అయితే కెరీర్‌లో తిరిగి పుంజుకునేందుకు మురళి విజయ్‌కు అనుకూల సమయమని అభిప్రాయపడ్డారు. మురళి విజయ్ తన అద్భుత ఆటతీరుతో జట్టుకు ఎన్నో విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడారని శ్రీకాంత్ ఆడాడని గుర్తు చేశాడు. ఓపెనర్‌గా విజయ్ ఇన్నింగ్స్ ప్రారంభించగలడని తెలిపాడు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనియే సీఎస్‌కే టీమ్‌కు అతి పెద్ద బలమని తెలిపారు. మ్యాచ్‌లను గెలిపించడంలో ధోనికి అపార అనుభవం ఉందని శ్రీకాంత్ పేర్కొన్నాడు.