ఐపీఎల్ లో భాగంగా బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడింది. భారీ వర్షం కురుస్తుండటంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. ఈ మ్యాచ్‌లో రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించిన బెంగళూరు ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం కోల్పోయింది. ఇక రాయల్స్ కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇందులో గెలిస్తేనే ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.