IPL 2021 Auction: సిడ్నీ హీరో విహారికి నిరాశ.. ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు

IPL 2021 Auction: తెలుగు క్రికెటర్లకు నిరాశ ఎదురైంది. వేలంలో తెలుగు క్రికెటర్లను దక్కించుకునేందుకు ఎవరూ ఆసక్తి చూలేదు.

Update: 2021-02-18 11:52 GMT

విహారి ఫైల్ ఫోటో 

IPL 2021 Auction: ఐపీఎల్ సీజన్ 14(IPL 2021)మీని వేలం కొసాగుతుంది. ఈ వేలంలో విదేశి ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు మొగ్గుచూపాయాయి. షకిబ్‌ అల్‌ హసన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతడిని రూ.7 కోట్లకు మొయిన్‌ అలీని కొనుగోలు చేసింది. టీమిండియా బ్యాట్స్ మెన్ శివమ్‌ దూబెను రూ.4.4 కోట్లతో రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌మోరిస్‌ కోసం ముబయి, బెంగళూరు పోటీ పడ్డాయి. మోరిస్ ధర రూ.12 కోట్లు దాటగానే రాజస్థాన్‌ రాయల్స్‌ ఎంట్రీ ఇచ్చి రూ.16.25 కోట్లకు దక్కించుకుంది. ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్‌ మలన్‌ రూ.1.5 కోట్లకే పంజాబ్‌ కింగ్స్‌ దక్కించుకుంది. ఆసీస్‌ పేసర్‌ జే రిచర్డ్‌సన్‌‌ను పంజాబ్‌ కింగ్స్‌ రూ.14 కోట్లకు దక్కించుకుంది. బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ను రాజస్థాన్ కొలుగోలు చేసింది. న్యూజిలాండ్‌ పేసర్‌ ఆడమ్‌ మిల్న్‌ను ముంబయి ఇండియన్స్‌ రూ. 50లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది.

ఆసీస్ బ్యాట్స్ మెన్ మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌(Smith)ను ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. రూ.2 కోట్లకు ఆర్‌సీబీ బిడ్‌ను వేయగా ఢిల్లీ మరో 20 లక్షలు పెంచి 2కోట్ల 20 లక్షల రూపాయలకు దక్కించుకొంది. ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ కు మొండిచేయి చూపాయి. భారత జట్టు కీలక ఆటగాడు హనుమ విహారిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. విధ్వంసక ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ కోసం ఆర్‌సీబీ, చెన్నై సూపర్‌కింగ్స్‌ పోటీ పడ్డాయి. చివరికి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అతడిని రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది. 

టీమిండియా బ్యాట్స్ మెన్ హానుమ విహారి(Hanuma Vihari)కి మొండి చేయి ఎందురైంది. హానుమ విహారిని కనిస ధరకు కూగా కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ అసక్తి చూపలేదు. గత కొంత కాలంగా ఐపీఎల్ జట్ల యాజమాన్యలు  ఏవీ కూడా తెలుగు క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే  ఈ సారైనా టీమిండియా ప్లేయర్ హానుమ విహారిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ముందుకు వస్తాయని భావించారు. కాగా అది జరగకపోవడంతో క్రీడా అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News