ఐపీఎల్ సీజన్-13కి గురువారం వేలం జరుగుతోంది. ఈ వేలంలో స్వదేశీ క్రికెటర్లు ఎక్కువ ధర పలుకుతున్నారు. భారత క్రికెటర్ల విషయానికి వస్తే యూసఫ్ పఠాన్ కు కోనుగోలు చేయలేదు. అయితే కొందరు యువ ఆటగాళ్లకు నిరాశ తప్పలేదు. సౌరభ్ తివారీ, డేనియల్ సామ్, పవన్ దేశ్ పాండే, కేదార్ దేవధర్, ప్రభుస్రిమ్రన్ సింగ్, షారుఖ్ ఖాన్, విశాఖ కుర్రాడు కేఎస్ భరత్‌కు నిరాశ మిగిలింది. దీంతో తొలి సేషన్ ముగిసింది. మరి కాసేపట్లో రెండో సెషన్ ప్రారంభమవుతుంది.
* జిమ్మీ నీషమ్ 50 లక్షలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దక్కించుకుంది.
*హేజిల్ వుడ్ చెన్నై రూ.2కోట్లకు దక్కించుకుంది.
*ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు కోట్లకు కొనుగోలు చేసింది.
* వెస్టిండీస్ ఆటగాడు హెట్‌మైయిర్ భారీ ధర పలికాడు. ఢిల్లీ క్యాపిటల్స్ రూ.7.75 కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో పోటీ పడి మరి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. భారత్ పై జరిగిన టీ20 వన్డే సిరీస్ ల్లో హెట్ మైయిర్ భీరక ఫామ్‌లో కొనసాగిస్తున్నాడు.
.@SHetmyer right now! 😆🕺🏻#IPLAuction #IPLAuction2020 #ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/uWKqxdPXSE
— Delhi Capitals (@DelhiCapitals) December 19, 2019
* సౌతాఫ్రికా ప్లేయర్ డేవిడ్ విల్లర్ రూ.75లక్షలకు రాజస్థాన్ కొనుగోలు చేసింది.
*ఉత్తరప్రదేశ్ బౌలర్ కార్తీక్ త్యాగిని రూ.1.30 రాజస్థాన్ కొనుగోలు చేసింది.
* ఆకాశ్ సింగ్‌ను రూ.20లక్షలకు రాజస్థాన్ దక్కిచుకుంది.
*ఇషాన్ పోరెన్ రూ.20లక్షలకు పంజాబ్ దక్కించుకుంటే, సిద్ధార్థ్ రూ.20లక్షలకు కోల్‌కతా కొనుగోలు చేసింది.
* 14ఏళ్ల ఆఫ్గానిస్థాన్ కుర్రాడు నూర్ అహ్మద్ వేలంలో కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
*యశస్వీ జైస్వాల్ మరో సంచలనం సృష్టించాడు. 17ఏళ్ల ఈ క్రికెటర్ కోసం రాజస్థాన్ రాయల్స్ తీవ్రపోటీ పడి రూ.2.40కోట్లకు దక్కించుకుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
* స్పిన్నర్ వరణ్ చక్రవర్తిని రూ.4 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
*టీమిండియా ఆండర్ -19 కెప్టెన్ ప్రియమ్ గార్గ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ప్రియమ్ గార్గ్ కోసం సన్‌రైజర్స్ తో క్రింగ్స్ ఎలెవన్ తీవ్రంగా పోటీపడింది. ఎట్టకేలకు ప్రియమ్ గార్గ్‌ను రూ.1.90 సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
* జార్ఖండ్ యువ ఆటగాడు విరాట్ సింగ్‌ను సైతం సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.1.90 కోట్లకు కోనుగోలు చేసింది.
* రాహుల్ త్రిపాఠిని కోల్‌కతా రూ.60 లక్షలకు దక్కించుకుంది.
* టీమిండియా మరో యువ ఆటగాడు దీపక్ హుడాను రూ. 50లక్షలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దక్కించుకుంది.
* వికెట్ కీపర్ అనుజ్ రావత్‌ను 80లక్షల రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.
*వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్‌ను భారీ మొత్తం వెచ్చించి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 8.5 కోట్లకు కొనుగోలు చేసింది.
* భారత జట్టు ఆల్ రౌండర్ పియూష్ చావ్లా కోసం చైన్నె సూపర్ కింగ్స్ రూ.6.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. పియూష్ చావ్లా కోసం ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పోటీపడ్డాయి. చివరి నిమిషంలో చైన్నె కోనుగోలు చేసింది.
*ఆస్టేలియాన్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్10 కోట్ల 75 లక్షలకు పంజాబ్ కొనుగోలు చేసింది.
*ఆస్టేలియాన్ ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ సంచలనం సృష్టించాడు. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ అన్ని సీజన్లలో అత్యధిక వేలం యువరాజ్ సింగ్ రూ.16 కోట్లతో ఉన్నాడు. 2015లో ఢిల్లీ జట్టుభారీ ధరకు దక్కించుకుంది. తాజాగా కమిన్స్‌కు కోల్ కతా రూ.15.50 కోట్లు ధర పలికాడు.