SRH vs MI: ముంబైను ఢీకొట్టనున్న హైదరాబాద్.. ఉప్పల్ స్గేడియంలో ఇరుజట్ల గణాంకాలు ఇవే..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) ఎనిమిదో మ్యాచ్ మార్చి 27న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (SRH vs MI) మధ్య జరగనుంది.

Update: 2024-03-27 07:20 GMT

SRH vs MI: ముంబైను ఢీకొట్టనున్న హైదరాబాద్.. ఉప్పల్ స్గేడియంలో ఇరుజట్ల గణాంకాలు ఇవే..!

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) ఎనిమిదో మ్యాచ్ మార్చి 27న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (SRH vs MI) మధ్య జరగనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో ఓటమిని చవిచూశాయి. ఈ సీజన్‌లో తమ తొలి విజయాన్ని నమోదు చేసేందుకు ప్రయత్నిస్తాయి.

ఈ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. కాబట్టి వారిదే పైచేయి కావచ్చు. అయితే ఐపీఎల్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లను పరిశీలిస్తే.. గత కొన్ని మ్యాచ్‌ల్లో ముంబై జట్టుదే ఆధిపత్యం కనిపిస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ రెండూ చాలా మంచి జట్లు. ఇరు జట్ల కెప్టెన్లు ఈసారి మారారు. ఇటువంటి పరిస్థితిలో చాలా ఆసక్తికరమైన మ్యాచ్ చూడవచ్చు. ఇరుజట్ల మధ్య గత ఐదు మ్యాచ్‌ల గురించి మాట్లాడుకుంటే, అందులో ముంబై ఇండియన్స్ నాలుగింటిలో విజయం సాధించగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది.

ముంబై ఇండియన్స్‌పై ప్యాట్ కమిన్స్ 181 స్ట్రైక్ రేట్‌తో పరుగులు..

ఇతర గణాంకాల గురించి మాట్లాడితే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రికార్డు కూడా చాలా బాగుంది. సన్‌రైజర్స్‌పై ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 16 వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్‌పై హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాట్‌తో అద్భుతాలు చేశాడు. అతను ముంబైపై IPLలో 40 సగటుతో పరుగులు చేశాడు. ఈ కాలంలో అతని స్ట్రైక్ రేట్ కూడా 181.81గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్యాట్ కమిన్స్‌కు అవకాశం వస్తే బ్యాట్‌తో అద్భుతాలు చేయగలడని చెప్పొచ్చు.

IPL చరిత్రలో హైదరాబాద్, ముంబై జట్లు ఇప్పటి వరకు 21 సార్లు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఇందులో ముంబై 12 సార్లు గెలిచింది. సన్‌రైజర్స్ 9 సార్లు గెలిచింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్లు తలో 4 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం గత మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతను దాదాపు ఒంటిచేత్తో మ్యాచ్ గెలిచాడు. కానీ, చివరి ఓవర్లో అతనిని అవుట్ చేయడంతో జట్టు ఓడిపోయింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11

పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ మరియు మార్కో జాన్సెన్.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రీవిస్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, పీయూష్ చావ్లా, షమ్స్ ములానీ, జస్ప్రీత్ బుమ్రా, జెరాల్డ్ కోయెట్జీ మరియు ల్యూక్ వుడ్.

పిచ్ నివేదిక..

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇరు జట్లూ భారీ స్కోర్లు చేసేందుకు ప్రయత్నిస్తాయి. 170 కంటే ఎక్కువ స్కోర్ ఇక్కడ మంచిగా పరిగణిస్తున్నారు.

Tags:    

Similar News