PBKS vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

IPL 2021, PBKS vs KKR: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు (సోమవారం) కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడుతోంది.

Update: 2021-04-26 13:36 GMT

పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (ఫొటో ట్విట్టర్)

IPL 2021, PBKS vs KKR: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు (సోమవారం) అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడుతోంది. ఈ మేరకు టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేయనుంది.

వరుస పరాజయాలతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఈ సీజన్‌లో కొట్టుమిట్టాడుతోంది. సీజన్‌లో ఇప్పటికే ఐదు మ్యాచ్‌లాడిన కోల్‌కతా టీమ్ నాల్గింటిలో ఓడిపోయింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచ్‌ల్లో ఓడి రెండింటిలో విజయం సాధించింది.

ప్లేయింగ్ లెవన్

కోల్‌కతా నైట్‌ రైడర్స్: నితీష్ రానా, శుబ్మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, ఎయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, శివం మావి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

పంజాబ్ కింగ్స్: కెఎల్ రాహుల్ (కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, మొయిసెస్ హెన్రిక్స్, షారుఖ్ ఖాన్, క్రిస్ జోర్డాన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

Tags:    

Similar News