IPL 2021 SRH vs KKR Preview: కోల్‌కతా బలహీనత సన్‌రైజర్స్ కి కలిసొచ్చేనా..?

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడనుంది.

Update: 2021-04-11 11:05 GMT
డేవిడ్ వార్నర్ vs ఇయాన్ మోర్గాన్ (ఫొటో ట్విట్టర్)

IPL 2021 SRH vs KKR Preview: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు జరిగే మూడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడనుంది. చెన్నై చెపాక్ స్టేడియంలో ఈ రోజు (ఆదివారం) రాత్రి 7.30 గంటలకి ఈ మ్యాచ్ మొదలుకానుంది. రెండు జట్లలో హిట్టర్లకి కొదవలేదు. బౌలింగ్ పరంగా చూస్తే.. కేకేఆర్‌తో పోలిస్తే ఎస్‌ఆర్‌హెచ్ బలంగా ఉంది.

యువ ఆటగాళ్లపై గంపెడాశలు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో హిట్టర్ జానీ బెయిర్‌స్టో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అలాగే కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. ఇక మిడిలార్డర్‌లో కేన్ విలియమ్సన్, మనీశ్ పాండే, జేసన్ హోల్డర్, కేదార్ జాదవ్‌తో టీం బలంగా తయారైంది. ఇక ఓపెనర్ గా సాహా ఆడే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ పరంగా చూస్తే.. భువనేశ్వర్ కుమార్ రూపంలో టీమ్‌కి పెద్ద సపోర్ట్ దొరికింది. అతనితో పాటు రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, నటరాజన్ తమ సత్తా చాటుతున్నారు. ఇక ఆల్‌రౌండర్ పాత్రని జేసన్ హోల్డర్ భుజాలపై మోస్తున్నాడు. యువ ఆటగాళ్లపై చాలా హోప్స్ పెట్టుకున్న సన్‌రైజర్స్.. ప్రియమ్ గార్గె, అబ్దుల్ సమద్ ఐపీఎల్ 2021లోనైనా మంచి ప్రదర్శన చేయాలని ఆశిస్తోంది.

ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్‌పై నే గెలుపు బాధ్యత..

ఐపీఎల్ 2020లో అంచనాల్ని అందుకోలేక చతికలపడింది కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం. ఎక్కువగా బ్యాటింగ్ పై ఆధారపడే కేకేఆర్ టీం.. గతేడాది మెరుగైన బౌలింగ్ లైనప్ లేక దెబ్బతింది. అయితే, ఈ ఏడాది షకీబ్ అల్ హసన్, హర్భజన్ సింగ్ జట్టులో చేరారు. ఓపెనర్ శుభమన్ గిల్ మంచి ఫాంలోనే కనిపిస్తున్నాడు. ఇక కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, రాహుల్ త్రిపాఠి, ఆండ్రీ రసెల్‌తో ఆ జట్టు బలోపేతమైంది. వీరికి తోడు షకీబ్ అల్ హసన్ కూడా హిట్టింగ్ చేయగలడు.

బౌలింగ్ పరంగా.. పాట్ కమిన్స్, ప్రసీద్ క్రిష్ణ, శివమ్ మావీ తో బలం పెరిగింది. ఇక స్పిన్ లో వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్, హర్భజన్ సింగ్, కుల్దీప్ యాదవ్‌ తమ సత్తా చాటేందుకు ఆరాపటడుతున్నారు. ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ హిట్టింగ్‌పై ఆధారపడే కేకేఆర్, ఈ ఏడాదైనా కలిసికట్టుగా రాణిస్తుందో లేదో చూడాలి.

గత రికార్డులు:

  • ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 19 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. కేకేఆర్ టీం 12 మ్యాచ్‌ల్లో, 7 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపొందాయి.
  • హైదరాబాద్ చేసిన అత్యధిక స్కోరు 209 పరుగులుకాగా.. అత్యల్ప స్కోరు 128.
  • కోల్‌కతా సాధించిన అత్యధిక స్కోరు 183 పరుగులు మాత్రమే. అత్యల్ప స్కోరు 101.
  • గత సీజన్ ఈ రెండు జట్లూ 2 సార్లు తలపడ్డాయి. రెండింటిలోనూ కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది.
  • ఇక ఇప్పటి వరకూ కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు సార్లు టైటిల్ ను దక్కించుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒకసారి ఐపీఎల్ టైటిల్ చేజిక్కించుకుంది.

టీంలు

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (అంచనా) : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), వృద్దిమాన్ సాహా (కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్ / కేదార్ జాదవ్, మహ్మద్ నబీ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, టి నటరాజన్

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (అంచనా) : శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రానా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్ / సునీల్ నరైన్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

Tags:    

Similar News